Begin typing your search above and press return to search.
ఆకాశంలో బాహుబలి టిక్కెట్ రేట్
By: Tupaki Desk | 25 May 2015 11:30 AM GMTభారతీయ సినిమా చరిత్రనే తిరగరాయాలన్న సంకల్పంతో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా బాహుబలి. దాదాపు రూ.150కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క నాయకానాయికలుగా.. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలిభాగం చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది.
''బాహుబలి: ది బిగినింగ్'' పేరుతో జూలై 10న రిలీజవుతోంది. అయితే ఇంత భారీ బడ్జెట్‌తో సినిమాకి పెట్టుబడులు తిరిగి రావడం ఎలా? లాభాల బాటలో పయనించడం ఎలా? దీనికి మందు కనిపెట్టేశారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాకి టిక్కెట్ రేటును పెంచడం ద్వారా బ్రేక్ ఈవెన్ సాధించాలని భావిస్తున్నారు. ఆ మేరకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ని కలిసి విన్నవించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కేటీఆర్ అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన అట్నుంచి రాగానే తమ మొర వినిపిస్తారు. ప్రభుత్వం తరపున మంత్రి ఓకే చేయగానే నైజాంలో వెంటనే టిక్కెట్టు రేట్లు పెరుగుతాయి.
నైజాంలో పెంచితే ఏపీలోనూ పెంచేస్తారు. మల్టీప్టెక్సుల్లో వారాంతం(శుక్ర, శని, ఆది)లో ప్రస్తుతం ఉన్న రూ.150 రేటును రూ.250కి పెంచుతారు. బి,సి కేంద్రాల్లోనూ టిక్కెట్ రేటు డబుల్ అవుతుంది. ఆ మేరకు వినోదం సామాన్యుడికి ఎంతవరకూ అందుబాటులో ఉంటుందో మంత్రిగారు పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. ఏం చేస్తారో వెయిట్ అండ్ సీ.