Begin typing your search above and press return to search.
బ్రసెల్స్ లో బాహుబలి ప్రదర్శన..
By: Tupaki Desk | 5 April 2016 12:14 PM GMTటాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి దేశంలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో నిలవడమే కాదు.. ఎన్నో అవార్డులు - రివార్డులు కూడా సొంతం చేసుకుంది. తాజాగా 63వ జాతీయ ఉత్తమ చలన చిత్రంగా నిలిచింది బాహుబలి: ద బిగినింగ్. ఇప్పుడీ మూవీని బ్రసెల్స్ లో ప్రదర్శించనున్నారు.
బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో అంతర్జాతీయ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బాహుబలి ది బిగినింగ్ ను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఏప్రిల్ 6 సాయంత్రం అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 10.30కి బాహుబలి ప్రదర్శన ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైన బాహుబలి.. బ్రసెల్స్ లోనూ తన సత్తా చాటనుంది. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీలో ప్రభాస్ - రాణా - అనుష్క - తమన్నాలు ప్రధాన పాత్రలు పోషించారు. బ్రసెల్స్ షో విషయాన్ని బాహుబలి యూనిట్.. ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో పంచుకుంది. గతేడాది బుసాన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
ప్రస్తుతం బాహుబలి: ద కన్‌క్లూజన్ కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సీక్వెల్ విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉంది. 2017 ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీక్వెల్ లో యుద్ధ సన్నివేశాలతో పాటు - గ్రాఫిక్ వర్క్స్ - ఎమోషన్స్ లో ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్స్ అందిస్తానని రాజమౌళి ఇప్పటికే చెప్పేశాడు.