Begin typing your search above and press return to search.
గోవా ఫిలిం ఫెస్టివల్ కి బాహుబలి ఎంట్రీ
By: Tupaki Desk | 29 Oct 2016 3:54 AM GMTదేశంలో అనేక చలన చిత్రోత్సవాలు జరిగినా.. గోవాలో జరిగే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు బోలెడంత ప్రాముఖ్యత ఉంటుంది. దేశంలోని అన్ని భాషల నుంచి సినిమాలను ఎంపిక చేసి ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ ఫెస్టివల్ లో ఓ మూవీ ప్రదర్శితం కావడం అంటే.. ఆ చిత్రానికి దక్కిన గౌరవంగా భావిస్తారు. ఈ గోవా ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు తెలుగు నుంచి బాహుబలి మూవీ ఎంపిక కావడం విశేషం.
పలు భాషల నుంచి 230 నామినేషన్లు రాగా.. వాటిలో నుంచి 22 సినిమాలను ఎంపిక చేసి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. 13 మంది జ్యూరీ సభ్యులు నెల రోజుల పాటు కష్టపడి ఇక్కడ ప్రదర్శించే సినిమాలను.. పలు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఎంపిక చేశారు. టాలీవుడ్ దర్శక నిర్మాత సీవీ రెడ్డి కూడా ఈ ఎంపిక కమిటీలో ఉన్నారు. నిజానికి ఇక్కడ ఎంట్రీ ఇచ్చేందుకు బాహుబలికి పెద్ద కష్టమేం కాలేదు. 63వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలవడంతో.. రూల్స్ ప్రకారం బాహుబలికి అఫీషియల్ ఎంట్రీ ముందే ఫిక్స్ అయిపోయింది.
ఇక హిందీ నుంచి బాజీరావ్ మస్తానీ.. ఎయిర్ లిఫ్ట్ లను కూడా గోవా ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనుండగా.. నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 198 ఎంట్రీలను పరిశీలించి 21చిత్రాలను ఎంపిక చేసి.. ప్రదర్శించబోతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/