Begin typing your search above and press return to search.

సూప‌ర్ హీరో అంటూ టాయ్స్ అమ్మేస్తున్నారా?

By:  Tupaki Desk   |   6 Sept 2019 11:27 AM IST
సూప‌ర్ హీరో అంటూ టాయ్స్ అమ్మేస్తున్నారా?
X
`బాహుబ‌లి` సిరీస్ త‌ర్వాత ద‌క్షిణాది సినిమాకి ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై గౌర‌వం పెర‌గ‌డ‌మే కాదు.. మ‌న స్టార్ల‌కు దేశవిదేశాల్లో ప్ర‌త్యేకించి గుర్తింపు ద‌క్కుతోంది. జ‌పాన్- చైనా స‌హా చాలా యూర‌ప్ దేశాల్లోనూ ప్ర‌భాస్- రానా (బాహు- భ‌ళ్లా) లాంటి స్టార్ల ముఖాల్ని గుర్తు పడుతున్నారు. అదంతా ద‌ర్శ‌క‌ధీరుడి చ‌లువే అన‌డంలో సందేహం లేదు. కేవ‌లం సినిమా రూపంలోనే కాదు.. బాహుబ‌లి క్యారెక్ట‌ర్ల‌ను టాయ్స్ బిజినెస్ లోకి అనువ‌ర్తింప‌జేశారు. వీడియో గేమ్స్ .. యానిమేష‌న్ సిరీస్ లు ఇవ‌న్నీ మ‌రో ఎత్తు. ప్ర‌భాస్ న‌టించిన `సాహో` రిలీజ్ త‌ర్వాత ఇంకా బాహుబ‌లి టాయ్స్ అమ్మేస్తున్నార‌ట‌. సాహో జ‌యాప‌జ‌యాల మాట ఎలా ఉన్నా డార్లింగ్ ప్ర‌భాస్ కి మాత్రం విదేశాల్లో క్రేజు త‌గ్గ‌డం లేద‌ని ఈ బిజినెస్ రేంజ్ చెబుతోంది.

బాహుబ‌లి రిలీజై ఇంత‌కాలం అయినా ఇంకా.. అమ‌రేంద్ర బాహుబ‌లి విగ్ర‌హాల్ని జ‌పాన్‌-పోర్చుగ‌ల్- ఇట‌లీ లాంటి చోట్ల షాప్‌ వెండ‌ర్లు ఇంకా క్యాష్ చేసుకుంటున్నారు. ప్ర‌భాస్ ఫేస్ ఇంకా వ‌ర్క‌వుట‌వుతోంది. ప్ర‌స్తుతం దేశ విదేశాల్లో అభిమానులు ప్ర‌భాస్ ని ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ గా చూస్తున్నారు. అందుకే ప్ర‌భాస్ ఫేస్ ఉన్న టాయ్స్ కి డిమాండ్ అసాధార‌ణంగా ఉంద‌ని చెబుతున్నారు.

అదంతా స‌రే.. ఒకవేళ `సాహో` హిట్ట‌యితే అందులో ప్ర‌భాస్ ఫేస్ తో టాయ్స్ అమ్మేసేవారేమో? ఇప్ప‌టికే సాహో వీడియో గేమ్ ని రిలీజ్ చేశారు. మ‌రి టాయ్స్ బిజినెస్ కి సాహో రూపం అక్క‌ర‌కొస్తుందా? ఇంత‌కీ ప్ర‌స్తుత స‌న్నివేశంలో ఈ చిత్రాన్ని జ‌పాన్- చైనా లాంటి చోట్ల‌ రిలీజ్ చేస్తారా? అన్న‌ది వేచి చూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి