Begin typing your search above and press return to search.
బాహుబలి మేకర్స్ నయా మార్కెటింగ్
By: Tupaki Desk | 2 Aug 2015 8:04 AM GMTబాహుబలి అసాధారణ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లలో దుమ్ముదులిపేసింది. రికార్డులు మోతెక్కించింది. మేకర్స్ సంచుల కొద్దీ సొమ్ముల్ని వెనకేసుకున్నారు. దాదాపు 500కోట్లు ఇప్పటికే దక్కింది. మరో 100కోట్లు పైగానే వసూలు చేస్తుందన్న అంచనాలున్నాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఈ సినిమాని ఆదరించడం వల్లే ఇంత పెద్ద విజయం సాధ్యమైంది. ఇప్పుడు ఆ క్రేజును ఇంటిల్లి పాదికీ అమ్మేయడానికి మరోరకం ప్లాన్ సిద్ధమైంది. బాహుబలి సాఫ్ట్ టాయ్స్ పేరుతో కొన్ని ఉత్పత్తుల్ని తయార చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సినిమాలో కీలక పాత్రలు అయిన బాహుబలి, భళ్లాలదేవ, శివగామి, దేవసేన, కట్టప్ప, కాళకేయ వంటి పాత్రల్ని సాఫ్ట్ టాయ్స్ గా మార్చి మార్కెట్లో అమ్మకాలకు పెట్టనున్నారు. టాయ్స్ మార్కెట్ ఇప్పటికే దినదినాభివృద్ధి సాధిస్తోంది. ఇప్పటికే బాహుబలి క్యారెక్టర్లు పిల్లలకు బాగా పరిచయం అయిపోయాయి కాబట్టి టాయ్స్ కొనుగోళ్లు అసాధారణంగా ఉంటాయని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ఈ నయా గేమ్ ప్లాన్ అమల్లోకి రానుందన్నమాట! ఇదో 1000కోట్ల పైబడిన మార్కెట్ అన్నమాట!