Begin typing your search above and press return to search.

'బాహుబలి' ట్రయిలర్‌ 2.05 నిమిషాలు

By:  Tupaki Desk   |   24 May 2015 9:30 AM GMT
బాహుబలి ట్రయిలర్‌ 2.05 నిమిషాలు
X
జక్కన్న పోస్టర్ల సందడి ముగిసింది. తదుపరి ట్రైలరు, పాటలతో అలరించేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ నెల 31న హైదరాబాద్‌లో పాటల వేడుక జరగబోతోంది. అందులోనే థియేట్రికల్‌ ట్రైలర్‌ని ప్రదర్శించబోతున్నారు. ఆ మేరకు ట్రైలర్‌ని పక్కాగా సిద్ధం చేశారు. ట్రైలర్‌కి సెన్సార్‌ కూడా చేసేశారు. 2 నిమిషాల 5సెకన్ల నిడివితో ట్రైలర్‌ని రూపొందించారు. ఇక చూసి ఆస్వాదించడమే మిగులుంది.

ఈ నెల 31న హైదరాబాద్‌లో గ్రాండ్‌ మేనర్‌లో ఆడియో వేడుక జరగబోతోంది. బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ దాకా వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు వేడుకకి హాజరు కాబోతున్నారు. అందులో ఈవెంట్స్‌ కూడా అదిరిపోయేలా ఉంటాయని సమాచారం. అందుకే ఆడియో లైవ్‌ టెలిక్యాస్ట్‌ హక్కుల కోసం భారీగా పోటీ నెలకొంది. కోటి రూపాయలు వెచ్చింది టీవీ5 టెలిక్యాస్ట్‌ హక్కుల్ని సొంతం చేసుకొంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం ఇండియాలోనే అత్యంత భారీ చిత్రంగా ప్రచారంలో ఉంది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించారు. జులై 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది.