Begin typing your search above and press return to search.

బాహుబలి ట్రైలర్‌ సెన్సేషనల్‌ రికార్డ్‌

By:  Tupaki Desk   |   9 Jun 2015 5:00 PM IST
బాహుబలి ట్రైలర్‌ సెన్సేషనల్‌ రికార్డ్‌
X
ఓ హిందీ సినిమా ట్రైలర్‌కు వారంలో కోటి వ్యూస్‌ వచ్చినా అద్భుతమే. అలాంటిది ఓ రీజనల్‌ లాంగ్వేజ్‌ మూవీ ట్రైలర్‌కు వారం రో8జుల్లో కోటికి పైగా వ్యూస్‌ రావడమంటే మామూలు విషయం కాదు. ఈ ఘనత 'బాహుబలి' సొంతమైంది. జూన్‌ 1న బాహుబలి ట్రైలర్‌ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలవగా.. 24 గంటల్లోపే 24 లక్షల వ్యూస్‌ రావడం తెలిసిన సంగతే. కాగా తర్వాతి ఆరు రోజుల్లోనూ ట్రైలర్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అన్ని భాషల ప్రేక్షకులూ ట్రైలర్‌ను ఆసక్తిగా చూడటంతో వారం రోజుల్లో కోటికి పైగా వ్యూస్‌ వచ్చాయి.

తెలుగు వెర్షన్‌ వరకు ఫేస్‌ బుక్‌లో 25 లక్షలకు పైగా, యూట్యూబ్‌లో రూ.31 లక్షలకు పైగా, ఇతర ఛానెల్స్‌లో రూ.13 లక్షలకు పైగా హిట్స్‌ వచ్చాయి. అంటే కేవలం తెలుగు ట్రైలర్‌కు మాత్రమే దాదాపు 70 లక్షల వ్యూస్‌ వచ్చాయన్న మాట. ఇప్పటిదాకా తెలుగులో మరే సినిమా ట్రైలర్‌ కూడా 30 లక్షల మార్కు కూడా అందుకున్న దాఖలాలు లేవు. ఇక హిందీ ట్రైలర్‌కు ధర్మ ప్రొడక్సన్స్‌ యూట్యూబ్‌ ఛానెల్లో 21 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. తమిళ ట్రైలర్‌కు రూ.7 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. మలయాళ ట్రైలర్‌ కూడా లక్షకు పైగా హిట్లు తెచ్చుకుంది. మొత్తంగా వారం రోజుల్లోనే కోటి వ్యూస్‌ మార్కు దాటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది బాహుబలి ట్రైలర్‌.