Begin typing your search above and press return to search.

అన్ని చోట్లా ఆడించడానికి అదే ప్లాన్‌

By:  Tupaki Desk   |   6 July 2015 7:30 PM GMT
అన్ని చోట్లా ఆడించడానికి అదే ప్లాన్‌
X
సుదీర్ఘ కాలం అవిశ్రాంత పోరాటం తర్వాత ఇంతకాలానికి కాసింత తీరిగ్గా ఉన్నాడు రాజమౌళి. బాహుబలి తెలుగు, తమిళ్‌, హిందీ వెర్షన్లు ఈ నెల 10న రిలీజైపోతున్నాయి. కేవలం ప్రచారం హడావుడి తప్ప ఊపిరి సలపనంత షెడ్యూల్‌ లేదిప్పుడు. అందుకే కాసింత తీరిగ్గా బోలెడన్ని ముచ్చట్లు చెబుతున్నాడు జక్కన్న. అతడు చెప్పిన తాజా ముచ్చట్లలో ఓ పాయింట్‌ అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా వితవుట్‌ ఎనీ బిగ్‌ స్టార్స్‌.. మనోడు హిందీ, తమిళం, మలాయళంలో సినిమాను రిలీజ్‌ చేస్తున్న తీర అద్భుతంగా. తమన్నా, అనుష్క పేరు చెబితే తమిళంలో సినిమాలు ఆడే సీన్‌ లేదు. అసలు ఈ బ్యాచ్‌ అంతా మలయాళంలో ఎవ్వరికీ తెలియదు. ఇక హిందీ విషయానికి వస్తే రానా తప్పించి అందరూ అక్కడ కొత్తాళ్లే. తమన్నా ఏదో సోసోగా మాత్రమే అందరికీ తెలుసు. ఇలాంటప్పుడు తన కంటెంట్‌ అందరికీ ఎలా మ్యాచ్‌ అవుతుందని అనుకున్నాడు? నిజానికి ఈ సినిమాలోని క్యారెక్టర్లు, కోటలు, మాహిష్మతి నగరం డిజైన్‌ చేయడానికి రాజస్థాన్‌ మొదలగు చోట్ల టూర్‌ వేసి మరీ స్కెచ్‌లు గీశారు. పైగా రాజస్థాన్‌ కోటల్లో కూడా కొన్ని సీన్లు తీశారు. అంటే లొకేషన్‌ వైజ్‌ ఈ సినిమా నార్త్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అవుతుంది. ఇక సబ్జెక్‌ వైజ్‌ ఇందులో మహాభారతం తాలూకు హ్యుమన్‌ ఎమోషన్స్‌ ఉన్నాయి కాబట్టి.. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆటోమ్యాటిక్‌గా ఎక్కేస్తుందట. వాటే ప్లాన్‌ సర్‌జీ.

ఇకపోతే.. బాహుబలి పార్ట్‌ 2.. సెప్టెంబర్‌ నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణకు వెళుతుంది. అంతకంటే ముందు ఓ నెలరోజుల పాటు విరామం తీసుకుంటున్నానని జక్కన్న చెప్పాడు. అయితే ఈ నెల రోజులూ ఏం చేయబోతున్నారూ? ''వెకేషన్‌ అంటే నా దృష్టిలో ఫ్యామిలీ టూర్‌ మాత్రమే కదండీ..'' అంటూ నవ్వేశాడు జక్కన్న.