Begin typing your search above and press return to search.

బాహుబలి కథ కొనసాగుతుందా?

By:  Tupaki Desk   |   29 Aug 2017 1:27 PM GMT
బాహుబలి కథ కొనసాగుతుందా?
X
భారతదేశ చలన చిత్ర బాక్స్ ఆఫీస్ రికార్డులను ఒక్కసారిగా బాహుబలి ఏ రేంజ్ లో తీరగరాసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఐదేళ్ల కష్టానికి ఓ చిత్రం అందించిన కీర్తి అంతా ఇంతా కాదు. మొదటి పార్ట్ మొదలైనప్పుడే బాహుబలి గురించి ఎలాంటి సమాచారం వచ్చినా ఆనందంగా ఉండేది. రెండవ పార్ట్ విడుదలయ్యే వరకు ఆ ఆనందం అలానే కొనసాగింది.

కానీ సినిమా కథ రెండవ పార్ట్ కి ముగియడంతో ఆ చిత్ర్రం లోని పాత్రలను మరియు రాజ్యాన్ని ఎవరు మర్చిపోలేక పోతున్నారు. అయితే అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఆ చిత్రం టెలివిజన్ సిరీస్ గా అన్ని భాషల్లో తెరకెక్కడం ఖాయమని తెలుస్తోంది. ఓ ప్రముఖ బడా కంపెనీ బాహుబలిని ఇంకా సాగదీసేందుకు కృషి చేస్తోందని టాక్. అయితే ఆ సిరీస్ కు రాజమౌళి మరియు ఆ చిత్రం లోని కొంతమంది పాత్ర దారులు నటించకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే రాజమౌళి ఇంతకుముందే చాలా సార్లు చెప్పాడు మళ్లీ బాహుబలి కథ ఇక సాగదని. కానీ సీరియల్ లాగా పాత్రలతో కొన్ని ఎపిసోడ్స్ ని తెరకెక్కిస్తానని ఆ మధ్యలో చెప్పాడు. మరి టివి సిరీస్ రూపంలో రాజమౌళి లేకుండా తీసే బాహబలిని ప్రేక్షకులు ఇష్టపడతారా అనేది సందేహంగానే ఉంది.

ఏదేమైనా అధికారికంగా ఆర్కా సంస్థ ఈ విషయం గురించి స్పందించేవరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ టివి సిరీస్ ను ఎలా తియ్యాలి ఎవరితో తీయాలి అనే విషయంపై నిర్మాతలు కసరత్తులు చేస్తుంటే.. రాజమౌళి మాత్రం తన తదుపరి సినిమా కథ గురించి జరుగుతున్న చర్చల్లో బిజీగా ఉన్నాడట.