Begin typing your search above and press return to search.
రజనీ ఫ్యాన్స్ హంగామా మొదలైనట్టేనా!
By: Tupaki Desk | 4 Dec 2022 5:30 PM GMTటాలీవుడ్ లో 4 k ప్రింట్ ల హంగామా మొదలైంది. క్రేజీ స్టార్ ల కెరీర్ లో అత్యంత కీలకంగా నిలిచి వారి కెరీర్ లని మలుపు తిప్పిన సినిమాలని 4 kలోకి రీమాస్టర్ చేస్తూ రీ రీలీజ్ లు చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ ల బర్త్ డే సెలబ్రేషన్స్ ని ముందు టార్గెట్ చేసుకుంటూ క్రేజీ బ్లాక్ బస్టర్ ల సినిమాలని రీ మాస్టర్ చేస్తూ రీ రిలీజ్ చేస్తుండటంతో వారి అభిమానులు సెలబ్రేట్ చేసుకోవడం మొదలే పెట్టారు. అంతే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఇలాంటి సినిమాలని రిలీజ్ చేస్తుండటం.. భారీగా వసూళ్లని రాబడుతుండటం విశేషం.
ఈ విషయాన్ని పసిగట్టిన కొంత మంది ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాలని రీ మాస్టర్ చేసి రీ రిలీజ్ చేయడం వల్ల మళ్లీ కాసుల వర్షం కురుస్తుండటంతో చాలా మది ఈ తరహా రీరిలీజ్ ల కోసం పలు సినిమాలని కొంటూ కొత్త మార్కెట్ కు తెరలేపుతున్నారు. ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా రీరిలీజ్ లకు భారీ ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఈ తరహా సినిమాల రిలీజ్ లు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి.
తెలుగులో ఈ ట్రెండ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ `పోకిరి`తో 4కె ప్రింట్ ల రీ రిలీజ్ తో శ్రీకారం చుట్టారు. ఈ మూవీకి భారీ స్థాయిలో ఆదరణ లభించడంలో ఆ తరువాత పవన్ కల్యాణ్ `జల్సా`.. ప్రభాస్ రెబల్, వర్షం, బిల్లా.. నందమూరి బాలకృష్ణ `చెన్నకేశవరెడ్డి` వంటి సినిమాలు రీ మాస్టర్ చేసి 4కెలో రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే బ్లాక్ బస్టర్ సినిమాలనే రీ మాస్టర్ చేసి రీ రిలీజ్ చేయాలనే పంథా కాస్త మారి ఏది దొరికితే దాన్ని హిట్టు ఫ్లాపు అనే సంబంధం లేకుండా రీ రిలీజ్ లు చేస్తుండటం ఇప్పడు చర్చనీయాంశంగా మారి రీ రిలీజ్ లపై ప్రేక్షకులు.. అభిమానులు విసిగిపోయేలా మారుతోంది.
త్వరలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `బాబా` మూవీని కూడా రీ మాస్టర్ చేసి 4కెలో తమిళ, తెలుగు భాషల్లో రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 2002లో సురేష్ కృష్ణ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించలేక డిజాస్టర్ అనిపించుకుంది. అలాంటి సినిమాని రజనీ పుట్టిన రోజున మళ్లీ ఇన్నేళ్ల తరువాత రీ రిలీజ్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఆదివారం ఈ మూవీ 4 కె తమిళ ట్రైలర్ ని రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం `బాబా` ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. `బాబా`లో సరికొత్త సీన్ లని యాడ్ చేశారట. వీటికి రజనీ తాజాగా డబ్బింగ్ చెప్పడం విశేషం. మరి ఆ సీన్ లతో అయితే బాబా మరింత కొత్తగా వుండి ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో.. రీ రిలీజ్ లో హిట్ అనిపించుకుంటుందో వేచి చూడాల్సిందే.