Begin typing your search above and press return to search.

బాబోయ్‌ లెజెండ్‌ అంకుల్‌ మళ్లీ వస్తాడట!

By:  Tupaki Desk   |   17 Sep 2022 11:30 AM GMT
బాబోయ్‌ లెజెండ్‌ అంకుల్‌ మళ్లీ వస్తాడట!
X
తమిళ శరవనన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా సంవత్సరాలుగా ఈయన తన సంస్థ యొక్క ప్రచార చిత్రాల్లో మరియు యాడ్ ఫిల్మ్స్ లో కనిపిస్తూ వస్తున్నాడు. ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేసినా కూడా వాటిని పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవల ఏకంగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.

ది లెజెండ్‌ అంటూ శరవనన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇద్దరు బాలీవుడ్‌ స్టార్‌ ముద్దుగుమ్మలను తన సరసన నటింపజేసిన శరవనన్ ఆ సినిమాకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడు. కేవలం తమిళంలోనే కాకుండా సౌత్‌ లో అన్ని భాషలతో పాటు ఉత్తరాదిన కూడా విడుదల చేయడం జరిగింది. సినిమాకు పెట్టిన ఖర్చు ఏమో కానీ కనీసం పబ్లిసిటీ ఖర్చులు వెనక్కి రాలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

కోలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ది లెజెండ్‌ సినిమాను రూ.50 కోట్ల రూపాయలతో నిర్మించి నటించిన శరవనన్ చాలా నష్టపోయాడు. అయినా కూడా హీరోగా చేయాలనే ఉత్సాహం మరియు ఆసక్తి ఆయనకు తగ్గలేదు. అందుకే మళ్లీ సినిమా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట.

ప్రస్తుతం శరవనన్ యొక్క రెండవ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. ఏ క్షణంలో అయినా రెండవ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ తమిళ్‌ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి అంతకు మించి బడ్జెట్‌ ను ఖర్చు చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.

శరవనన్‌ రెండవ సినిమా అంటూ వస్తున్న వార్తలపై సోషల్‌ మీడియాలో మీమ్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. లెజెండ్‌ అంకుల్‌ మళ్లీ వస్తున్నారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.. మరి కొందరు ఈసారి బాలీవుడ్‌ హీరోయిన్స్ ఐశ్వర్య రాయ్ మరియు దీపికా పదుకొనే ను తీసుకు రావాలంటూ కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.