Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: లేడీ బౌన్స‌ర్ త‌డాఖా చూపించిందిగా!

By:  Tupaki Desk   |   5 Sep 2022 9:01 AM GMT
ట్రైల‌ర్ టాక్: లేడీ బౌన్స‌ర్ త‌డాఖా చూపించిందిగా!
X
మిల్కీబ్యూటీ త‌మ‌న్నా క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సౌత్ స‌హా బాలీవుడ్ లోనూ బిజీగా కొనసాగుతూ పాన్ ఇండియా బ్యూటీగా వెలిగిపోతుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు తెలుగు..త‌మిళ్..క‌న్న‌డ‌...హిందీ భాష‌ల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుంది. ఈ క్ర‌మంలోనే లేడీ ఓరియేంటెడ్ పాత్ర‌ల్ని సైతం విడిచిపెట్ట‌డం లేదు. స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల నుంచి ఉమెన్ సెంట్రిక్ పాత్ర‌ల్లోనూ మెప్పించే ప్ర‌య‌త్నం చేస్తుంది.

తాజాగా త‌మ‌న్నా బాలీవుడ్ లో 'బ‌బ్లీ బౌన్స‌ర్' అనే సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు. తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే చిత్ర టైల‌ర్ ని రిలీజ్ చేసారు. తమన్నా భాటియాను మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో చూపించిన‌ట్లు తెలుస్తోంది.

త‌మ‌న్నా యాక్టింగ్ లో కొత్త యాంగిల్ ని తీసుకున్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్ధ‌మ‌వుతుంది. ఆద్యంతం వినోదం ప్ర‌ధానంగా సాగే చిత్రంలో క‌నిపిస్తుంది. త‌మ‌న్న పాత్ర‌ని హాస్యాస్పందంగా మ‌లిచిన విధానం బాగుంది. ఓ సారి ట్రైల‌ర్ చూస్తే..'' ఫ‌తేపూర్ బేబి. ఈ ఊరు బౌన్స‌ర్ కి కేరాఫ్ ఆడ్ర‌స్. ఏ పిల్లోడైనా పెద్దాయ్యాక సెటిల్ అవ్వాలంటే బాడీ పెంచాల్సిందే. అదీ ఒక ప‌హిల్వాన్ లాంటి బాడీ.

ఈ క‌థ కూడా అలాంటిందే అంటూ ట్రైల‌ర్ బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఓవ‌ర్ ని బ‌ట్టే క‌థ ఎలా ఉంటుంద‌న్న‌ది రివీల్ చేసారు. ఇక్క‌డ‌ ప‌హిల్వాన్ అంటే అబ్బాయి కాదు చాకులాంటి అమ్మాయి... అంటూ త‌మ‌న్నా మాస్ రోల్ ని రివీల్ చేసారు. త‌మ‌న్నా ఎంట్రీనే థియేట‌ర్లో కేక‌లు పెట్టించేలా క‌నిపిస్తుంది. ఓ మెడిక‌ల్ షాప్ కి వెళ్లి అన్నా రెండు కండోమ్ ప్యాకెట్లు ఇవ్వు అని త‌మ‌న్నా చెప్పిన‌ డైలాగ్ ఎలా పేల్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

ఊళ్లో ఈ లేడీ బ‌బ్లీ చాలా ఫేమ‌స్. అంద‌రికంటే ఎక్కువ బ‌రువులు ఎత్తేది ఈ బ‌బ్లీనే. త‌మ‌న్నా పాత్ర‌ని ఆద్యంతం మ‌గ‌రాయుడు రోల్ లా డిజైన్ చేసిన‌ట్టు క‌నిపిస్తుంది. ఈ క్ర‌మంలోనే త‌మ‌న్నా లేడీ బౌన్స‌ర్ గా మారుతుంది.

త‌మ‌న్నా పాత్ర‌లో యాక్ష‌న్ తో పాటు..హాస్యాన్ని స‌మ‌పాళ్ల‌లో వ‌డ్డి వార్చిన‌ట్లు క‌నిపిస్తుంది. షీ ఈజ్ బోల్డ్ అండ్ బ్రేవ్ గాళ్ అంటూ త‌మ‌న్నా ధైర్య‌సాహ‌సాల్ని రివీల్ చేసారు. ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌ధానంగా కామెడీని హైలైట్ చేసారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.