Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 'బాబు బాగా బిజీ'
By: Tupaki Desk | 5 May 2017 10:35 AM GMTచిత్రం : ‘బాబు బాగా బిజీ’
నటీనటులు: అవసరాల శ్రీనివాస్ - మిస్తీ చక్రవర్తి - తేజస్వి మదివాడ - సుప్రియ - శ్రీముఖి - ఆదర్శ్ బాలకృష్ణ - ప్రియదర్శి - రవిప్రకాష్ - తనికెళ్లభరణి - సుధ తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్
ఛాయాగ్రహణం: సురేష్ భార్గవ
కథ: హర్షవర్ధన్ కులకర్ణి
నిర్మాత: అభిషేక్ నామా
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: నవీన్ మేడారం
ఇప్పటిదాకా కామెడీ.. క్యారెక్టర్ రోల్సే చేస్తూ వచ్చిన అవసరాల శ్రీనివాస్ తొలిసారి హీరో అవతారం ఎత్తాడు ‘బాబు బాగా బిజీ’ సినిమాతో. ఇది బాలీవుడ్లో సూపర్ హిట్టయిన అడల్ట్ కామెడీ ‘హంటర్’కు రీమేక్. ఇలాంటి సినిమాలు తెలుగులో ఏమాత్రం వర్కవుటవుతాయో అన్న సందేహాలేమీ పెట్టుకోకుండా అవసరాల లాంటి మంచి నటుడిని హీరోగా పెట్టి రీమేక్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. కొత్త దర్శకుడు నవీన్ మేడారం రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
మాధవ్ (అవసరాల శ్రీనివాస్)కు యవ్వన దశ నుంచి శృంగారం మీదికి దృష్టిమళ్లుతుంది. కాలేజీ రోజుల్లోకి వచ్చేసరికి ఎఫైర్లు మొదలవుతాయి. అమ్మాయిలు.. ఆంటీలు అని తేడా లేకుండా ఎవరు దొరికితే వాళ్లు అన్నట్లుగా సాగిపోతుంటుంది అతడి శృంగార ప్రయాణం. ఈ స్టోరీలన్నీ ముగిసిపోతున్న దశలో ఒక పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటాడు మాధవ్. ఐతే అతను తన గురించి వాస్తవాలు చెబుతుంటే ఒక్కో అమ్మాయి అతడి నుంచి పారిపోతుంటుంది. అప్పుడు రాధ (మిస్తీ చక్రవర్తి) అనే అమ్మాయికి తాను మిస్టర్ క్లీన్ అన్నట్లు అబద్ధం చెప్పి తనతో ప్రయాణం మొదలుపెడతాడు మాధవ్. ఆమెకు అతను నచ్చి ఇద్దరికీ నిశ్చితార్థం జరుగుతుంది. ఐతే అప్పటికీ మాధవ్ చిలక్కొట్టుడు ఆపడు. మరి అతడికి ఏ దశలోనూ రియలైజేషన్ రాలేదా.. రాధకు తన గురించి వాస్తవాలు చెప్పాడా లేదా.. చివరికి వీళ్లిద్దరి పెళ్లి జరిగిందా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
కొన్ని సినిమాలు ఒక భాషలో చాలా మంచి ఫీలింగ్ కలిగిస్తాయి. సూపర్ హిట్టవుతాయి. కానీ అవే సినిమాలో మరో భాషలోకి వచ్చేసరికి పేలవంగా అనిపిస్తుంటాయి. ప్రతి సన్నివేశాన్ని ఉన్నదున్నట్లు దించేసినా సరే.. అవి ఒరిజినల్ ఇచ్చిన ఫీలింగ్ ఇవ్వవు. గడ్డం గ్యాంగ్.. నరుడా డోనరుడా లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. వాటి ఒరిజినల్స్ ఎంత పెద్ద విజయం సాధించాయో.. ప్రేక్షకులకు ఎంత మంచి ఫీలింగ్ ఇచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ వాటిని తెలుగీకరించేసరికి ఎసెన్స్ అంతా పోయింది. ‘బాబు బాగా బిజీ’ కూడా ఈ కోవలోని సినిమానే.
దాదాపుగా ‘హంటర్’లోని ప్రతి సన్నివేశాన్నీ తెలుగులోకి తెచ్చేసినా.. ఒరిజినల్ మాదిరి జెన్యూన్ అడల్ట్ కామెడీ చూస్తున్న ఫీలింగ్ ఇది ఎంతమాత్రం కలిగించదు. ఆత్మ లోపించినట్లు.. కృత్రిమంగా అనిపిస్తూ.. మరీ నెమ్మదిగా సాగుతూ.. ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది ‘బాబు బాగా బిజీ’. ఈ సినిమా పోస్టర్లు.. టీజర్.. ట్రైలర్ చూసి హై డోస్ రొమాన్స్ ఆశించే వాళ్లు కూడా ఈ సినిమా చూసి అంత సంతృప్తేమీ చెందకపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం. కాకపోతే.. అంతో ఇంతో శాటిస్ఫై అయ్యేది ఆ వర్గం ప్రేక్షకులే.
‘బాబు బాగా బిజీ’ని ప్రమోట్ చేసిన తీరు చూసి.. సినిమాను తీర్చిదిద్దిన తీరు చూస్తే అడల్ట్ కామెడీని సొమ్ము చేసుకునే ప్రయత్నంలా కనిపిస్తుంది తప్ప మరోకటి కాదు. ‘హంటర్’ తెలుగులోకి వచ్చేసరికి ఏం మిస్సయింది అని చెప్పడం కష్టం. కానీ ఒరిజినల్ చూసిన వాళ్లకు ఏదో మిస్సవుతోందన్న ఫీలింగ్ వెంటాడుతూ ఉంటుంది. అడల్ట్ కామెడీగా చెప్పుకున్న ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ మరీ వెర్రెత్తించేసేలా ఏమీ లేదు. మన ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని హిందీతో పోలిస్తే కొంచెం డోస్ తగ్గించినట్లున్నారు. కాబట్టి ప్రోమోస్ చూసి ఏదో ఊహించుకుంటే కష్టం. ఇక కామెడీ విషయానికి వస్తే.. అదీ ఆశించిన స్థాయిలో లేదు.
ఒరిజినల్లో ఉన్న జెన్యూన్ లాఫ్స్ ఇక్కడ కనిపించవు. అవసరాల-ప్రియదర్శి కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో మినహాయిస్తే కామెడీ వర్కవుట్ కాలేదు. ‘హంటర్’తో పోలికల సంగతి పక్కన పెట్టేసి మామూలుగా చూసినా ‘బాబు బాగా బిజీ’ ఏమంత ఎఫెక్టివ్ గా అనిపించదు. కథను వర్తమానంలో ముందుకు తీసుకెళ్తూ.. అప్పుడప్పుడూ గతంలోకి వెళ్లి వస్తూ.. స్క్రీన్ ప్లేను డిఫరెంటుగా నడిపించే ప్రయత్నం చేశారు. కానీ అదేమంత ప్రత్యేకంగా అనిపించదు. కొన్ని చోట్ల ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు. లీడ్ స్టోరీకి కొన్ని ఉపకథల్ని జోడించారు. వాటి వల్ల డీవియేషనే తప్ప.. అవి అంత ఆసక్తేమీ రేకెత్తించవు.
ఇప్పటిదాకా ఎక్కువగా సాఫ్ట్.. క్లీన్ క్యారెక్టర్లలో అవసరాలను చూడటం వల్లో ఏమో.. సెక్స్ అడిక్ట్ పాత్రలో అతను నప్పినట్లుగా అనిపించడు. పైగా ఈ పాత్ర నిజంగా సెక్స్ అడిక్ట్ అనిపించేలా దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. లీడ్ యాక్టరే పాత్రకు సూటవ్వనట్లు అనిపించేసరికి.. చాలా సన్నివేశాలు కూడా అసహజంగా అనిపిస్తాయి. బాలీవుడ్ ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లుగా ‘హంటర్’ నెమ్మదిగా సాగితే.. ఇక్కడా అలాగే కథనాన్ని నడిపించారు. దీంతో చాలా చోట్ల సినిమా మరీ నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. రెండు గంటల 10 నిమిషాల లోపు నిడివి ఉన్నా సరే.. చాలా పెద్ద సినిమా చూసిన భావన కలిగిస్తుంది ‘బాబు బాగా బిజీ’.
ఆంటీతో హీరో ఎఫైర్ ఎపిసోడ్ వరకు మాత్రమే ‘బాబు బాగా బిజీ’ ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాల్ని అందుకుంటుంది. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తూ సాగుతుంది ఈ ఎపిసోడ్. ఇక్కడ రొమాన్స్ పాళ్లకు కూడా ఢోకా లేదు. ఇక వర్తమానంలో లీడ్ హీరోయిన్.. హీరో మధ్య సాగే ఎపిసోడ్ చాలా బోరింగ్ గా.. మరీ నెమ్మదిగా సాగుతుంది. తేజస్వి ట్రాక్ ను కూడా పైపైన నడిపించేశారు. హీరోలో చివరగా రియలైజేషన్ వచ్చే సన్నివేశాలు కూడా అసహజంగా అనిపిస్తాయి. అక్కడ అనుకున్న స్థాయిలో ఎమోషన్ పండలేదు. అడల్ట్ కామెడీ అని బ్రాండ్ వేసుకున్నాక.. పూర్తిగా ఆ తరహాలోనే సినిమా సాగిపోతే.. ఓ వర్గం ప్రేక్షకులైనా మెచ్చేవాళ్లు. కానీ ‘బాబు బాగా బిజీ’ ఆ రకంగానూ మెప్పించలేదు. అక్కడక్కడా ఉన్న అడల్ట్ డోస్ వల్ల మిగతా ప్రేక్షకులు దీంతో సర్దుకుపోవడం కష్టం. ఆ రకంగా ‘బాబు బాగా బిజీ’ రెంటికీ చెడ్టట్లే అయింది.
నటీనటులు:
అవసరాల శ్రీనివాస్ నటనకు వంకలు పెట్టడానికేమీ లేదు. అతను బాగానే చేశాడు. తనదైన శైలిలో కొన్ని చోట్ల చిలిపి హాస్యం పండించాడు. అతడి డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటుంది. సినిమాలో చెప్పుకోదగ్గ పాజిటివ్ అంటే అవసరాల శ్రీనివాసే. కానీ సెక్స్ అడిక్ట్ పాత్రకు అతనంత బాగా సూటవవ్వలేదు. హీరోయిన్ మిస్తీ చక్రవర్తి.. జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆమె హీరోయిన్ అన్న ఫీలింగ్ కలగదు. సుప్రియ తన పాత్రకు న్యాయం చేసింది. ఆమె చాలా సెక్సీగా కనిపించింది. తేజస్వి చేసిందేమీ లేదు. ఆమె కూడా ఒక సీన్లో అందాలు ఆరబోసే ప్రయత్నం చేసింది. తేజస్వి తన ‘క్యూట్ అండ్ బబ్లీ’ హావభావాలకు ఇక సెలవిచ్చేస్తే బెటర్. శ్రీముఖిది చిన్న పాత్ర. ఆమె నటన ఓకే. హీరో ఫ్రెండు పాత్రలో ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. ఈసారి తెలంగాణ స్లాంగ్ విడిచిపెట్టేసి.. మామూలు యాసలోనూ ఆకట్టుకున్నాడు. రవిప్రకాష్ ఓకే. ఆదర్శ్ బాలకృష్ణ.. తనికెళ్ల భరణి.. సుధ.. వీళ్లంతా మామూలే.
సాంకేతికవర్గం:
సునీల్ కశ్యప్ సంగీతం ఆకట్టుకోదు. పాటలు సినిమాకు పెద్ద స్పీడ్ బ్రేకర్లు అయ్యాయి. ఒకట్రెండు పాటలు పర్వాలేదు. మిగతావి టార్చర్ పెడతాయి. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. ఛాయాగ్రహణం కూడా సాధారణంగా అనిపిస్తుంది. ఈ సినిమాతోనే నిర్మాణంలోకి వచ్చిన అభిషేక్ పిక్చర్స్.. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఏమాత్రం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు అనిపించదు. తక్కువ ఖర్చుతో లాగించేద్దామన్న భావనతో చేసినట్లుగా అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. ‘బాబు బాగా బిజీ’ మీద ఇంప్రెషన్ మరింత తగ్గిపోవడానికి ఇదీ ఒక కారణమే. దర్శకుడు నవీన్ మేడారం దర్శకుడిగా తన ముద్రంటూ ఏమీ వేయలేకపోయాడు. ఒరిజినల్లో ఉన్న ఎసెన్స్ ను అతను ‘బాబు బాగా బిజీ’లో తీసుకురాలేకపోయాడు. హానెస్ట్ అటెంప్ట్ లాగా అనిపించే ‘హంటర్’ తెలుగులోకి వచ్చేసరికి కృత్రిమంగా అనిపించిందంటే అది వైఫల్యమే.
చివరగా: ఈ బాబు.. బాగా బోరింగ్
రేటింగ్- 1.75/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre