Begin typing your search above and press return to search.
బాబు బంగారం.. వెంకీకి అన్యాయం
By: Tupaki Desk | 27 July 2016 8:16 AM GMTబాబు బంగారం.. ఈ టైటిల్ చూస్తేనే ఇది హీరో ఓరియెంటెడ్ సినిమా అని చెప్పేయొచ్చు. ఈ సినిమా టీజర్.. ట్రైలర్ చూస్తేనే ఇది వెంకీ అభిమానుల్ని టార్గెట్ చేసిన సినిమా అని చెప్పేయొచ్చు. వెంకీ సందడే సినిమాకు హైలైట్ అయ్యేలాగా ఉంది. ఐతే ఇలాంటి హీరో ఓరియెంటెడ్ సినిమా తమిళంలోకి వెళ్లేసరికి ఇంకో రకంగా మారిపోతోంది. ఈ మధ్య ప్రతి పెద్ద తెలుగు సినిమాను తమిళంలోకి కూడా అనువదించి ఒకేసారి రిలీజ్ చేసేస్తున్న సంగతి తెలిసిందే. ‘బాబు బంగారం’ను కూడా అలాగే చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో ‘సెల్వి’ పేరుతో అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే ఈ సినిమాకు పెట్టిన పేరే అభ్యంతరకరంగా ఉంది.
సెల్వి అంటే కుమారి అని అర్థం. అంటే ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారన్నమాట. నయనతార తమిళ ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ కావడం.. ప్రస్తుతం అక్కడ ఆమె హవా నడుస్తుండటంతో ఆమె బొమ్మ చూపించి సినిమాను సేల్ చేసేయాలని.. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలని భావిస్తున్నారు. తెలుగు సినిమాల్ని తమిళంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడంలో ఫేమస్ అయిన ‘భద్రకాళి ఫిలిమ్స్’ ఈ చిత్రాన్ని తమిళంలో అందిస్తుండటం విశేషం. ఐతే మిగతా స్టార్ హీరోలందరూ తమిళంలో మార్కెట్ పెంచుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి టైంలో వెంకీ సినిమా కూడా తమిళంలో రిలీజ్ చేస్తున్నందుకు సంతోషించాలో.. లేక హీరోయిన్ ఓరియెంటెడ్ టైటిల్ పెట్టి తమ హీరోను పక్కకు నెట్టేస్తున్నందుకు ఫీలవ్వాలో అర్థం కావడం అభిమానులకు అర్థం కావడం లేదు.