Begin typing your search above and press return to search.
ఒడ్డుకు చేరడం ఇక కష్టమే బాబూ!!
By: Tupaki Desk | 27 Aug 2016 3:30 AM GMTవెంకటేష్-మారుతిల కాంబినేషన్ లో వచ్చిన బాబు బంగారం ఇప్పుడు రెండు వారాలు పూర్తి చేసేసుకుంది. రెండో వారం ఈ మూవీ కేవలం 2.7 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. ఇందులో మెజారిటీ భాగం వీకెంట్స్ లో వచ్చేసినదే. చెప్పుకోదగ్గ సినిమాలు థియేటర్లలో లేకపోయినా.. బాబు బంగారం పరిస్థితి మెరగవలేదు.
మొత్తం రెండు వారాలకు కలిపి నైజాంలో 6.41 కోట్లు.. సీడెడ్ లో 2.98 కోట్లు.. ఉత్తరాంధ్రలో 2.66 కోట్లు.. గుంటూరు 1.92 కోట్లు.. ఈస్ట్ 1.80 కోట్లు - వెస్ట్ 1.59 కోట్లు.. కృష్ణా 1.70 కోట్లు.. నెల్లూరు 0.89 కోట్లు వసూళ్లు దక్కాయి. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు వారాలకు వచ్చిన మొత్తం 19.95 కోట్లు. అన్ని ఏరియాలు కలిపి ఈ సినిమాకి 30 కోట్ల బిజినెస్ చేశారు. కానీ ఇప్పుడు లెక్క 20 కోట్ల వరకే వచ్చింది. ఇప్పుడు బాబు బంగారం సేఫ్ జోన్ లోకి చేరాలంటే మరో పది కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.
కానీ పొజిషన్ అంత ఈజీగా కనిపించడం లేదు. ఈ వీకెండ్ లో అంతో ఇంతో వచ్చినా.. వచ్చే గురువారం నాటికి థియేటర్లలోకి జతా గ్యారేజ్ వచ్చేస్తుంది కాబట్టి.. ఈ మాత్రం వసూళ్లు కూడా దక్కవు. ఒక్క నైజాంలోనే స్వల్ప నష్టాలతో డిస్ట్రిబ్యూటర్ బయటపడనుండగా.. మిగిలిన ఏరియాల్లో లాస్ ఎక్కువగానే ఉండనుంది.