Begin typing your search above and press return to search.

ఇవి ఫైనల్ కలక్షన్లా? వామ్మో అరుపులే

By:  Tupaki Desk   |   5 Oct 2016 4:15 AM GMT
ఇవి ఫైనల్ కలక్షన్లా? వామ్మో అరుపులే
X
దర్శకుడు మారుతి రూపొందించిన ''బాబు.. బంగారం'' సినిమా రిజల్టు ఏంటసలు? మనోడు వరుసగా చాలా సక్సెస్ లు చూస్తే వచ్చి.. భలే భలే మగాడివోయ్ సినిమాతో ఏకంగా 25 కోట్ల షేర్ రేంజ్ హిట్టు కొట్టాడు. ఆ తరువాత మరి వెంకీతో అదే రేంజు కొడతాడా లేకపోతే నాని పవర్ లేదంటూ వెనక్కిపడతాడా అంటూ ట్రేడ్ ఎనలిస్టులు కామెడీ చేశారు కూడా. కాని మారుతి మాత్రం కొత్తగా ప్రూవ్ చేశాడండోయ్.

కేవలం యావరేజ్ టాక్ వచ్చిన బాబు బంగారం సినిమా.. ఫుల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 27.5+ కోట్లు షేర్ వసూలు చేసింది. సినిమాను మొత్తంగా అన్ని ఏరియాల్లో 30 కోట్లకు అమ్మారు కాబట్టి.. పంపిణీదారులకు మైనర్ లాసులే వచ్చుంటాయి. కాని యావరేజ్ టాక్ తో కూడా తన గత సినిమా రేంజును దాటేయడం అంటే మారుతికే చెల్లింది. ఇక నిర్మాతల సంగతి చూసుకుంటే.. ఆల్రెడీ 30 కోట్లకు సినిమాను అమ్మేసిన వారు.. శాటిలైట్ రైట్స్ 6.5 కోట్లకు అమ్మేశారు. అంటే 25 కోట్లకు తీసిన ఈ సినిమాతో ఎలా చూసినా కూడా 10 కోట్లు లాభం వచ్చింది. ఆ లెక్కన చూస్తే నిర్మాతలందరూ ఖచ్చితంగా మారుతి వెనుకే పడతారు.

బాబు బంగారం ఫైనల్ రన్ కలక్షన్లు చూస్తే అరుపులే అని అనాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు 35 కోట్ల రేంజ్ హిట్టు ను కొట్టిన దర్శకుల్లో మారుతి అగ్రజుడు. వేరే దర్శకులు అయితే 50+ రేంజ్ లేదంటే 15+ రేంజులోనే ఉన్నారు కాని.. 30+ లో ఒక్కళ్ళు కూడా లేరు. ఇంతకీ మారుతి తదుపరి సినిమా ఎవరితోనో మరి? వెయిట్ అండ్ సి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/