Begin typing your search above and press return to search.

బంగారం కాదు.. అక్కడ ఇత్తడైపోయింది

By:  Tupaki Desk   |   25 Aug 2016 5:21 AM GMT
బంగారం కాదు.. అక్కడ ఇత్తడైపోయింది
X
విక్టరీ వెంకటేష్- మారుతిల కాంబినేషన్ లో వచ్చిన బాబు బంగారం తెలుగు రాష్ట్రాల వరకూ బాగానే నడుస్తోంది. లాంగ్ వీకెండ్ తో పాటు.. తర్వాతి వారం వచ్చిన సినిమాలు మెప్పించలేకపోవడం.. వీటికి తోడు ఏపీలో పుష్కరాలకు హాలిడేస్ ప్రకటించడం లాంటివి బాబుకు బాగానే కలిసొచ్చాయి. అయితే.. ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాను కొన్న వాళ్లకు బాగానే దెబ్బ పడుతోంది.

మొదటి వారం చివరకు 400,000 డాలర్లను మాత్రమే వసూలు చేసిన బాబు బంగారం.. హాఫ్ మిలియన్ మార్క్ ను టచ్ చేయడం కూడా కష్టమే అని తేలిపోయింది. అంటే పంపిణీదారుల చేతికి కేవలం 2.4 కోట్ల గ్రాస్‌ వస్తే.. 1.5 కోట్ల షేర్ వచ్చిందనమాట. ఈ చిత్రాన్ని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్యాకేజ్ లో పార్ట్ గా కొనుగోలు చేశాడు. బాబు బంగారం.. ఆఆ.. ప్రేమమ్ చిత్రాలు మూడింటికీ కలిపి 6.5 కోట్ల డీల్ మాట్లాడుకుని కొనుగోలు చేయగా.. అఆ ను ఓన్ రిలీజ్ చేసుకుని బాగానే లాభపడగా.. బాబు బంగారం చిత్రాన్ని థర్డ్ పార్టీ బయ్యర్లకు 5 కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. సో 5 కోట్లలో 1.5 కోట్లు తిరిగొస్తే.. మిగిలిన బ్యాలన్స్ పరిస్థితేంటి బంగారం?

అంటే.. బంగారంపై ఇన్వెస్ట్ చేసినోళ్లకు దాదాపు ఆ పెట్టుబడంతా ఇత్తడైపోయినట్లే. మరి వాళ్ళకే ప్రేమమ్ కూడా ఇస్తే.. అది ఆల్రెడీ ప్రూవ్ అయిన రొమాంటిక్ సినిమా కాబట్టి.. ఈ బయ్యర్లందరూ కాస్త ఈజీగా కోలుకుంటారు. అది సంగతి.