Begin typing your search above and press return to search.
కబాలి వలన ఇక్కడ తేడాలొస్తున్నాయి
By: Tupaki Desk | 14 Jun 2016 5:30 PM GMTజూలై 1న ''కబాలి'' సినిమా వచ్చేస్తుందని ఎప్పటినుండో ప్రకటించడంతో.. ఖచ్చితంగా ఇక్కడ తెలుగులో కూడా రిలీజ్ ను కాస్త గ్రాండ్ గా చేస్తారు కాబట్టి.. మనోళ్లు ఎంతో జాగ్రత్తగా ఇతర తెలుగు రిలీజ్ లను ప్లాన్ చేయాలని చూస్తున్నారు. కాని ఇంతలో కబాలి రిలీజ్ డేట్ కబడ్డీ ఆడేయటం మొదలెట్టేసింది. దానితో మనోళ్లకు కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది.
గతంలో ఎనౌన్స్ చేసిన రిలీజ్ డేట్లను బట్టి చూస్తే.. జూలై 6న 'బాబూ బంగారం' సినిమా రావాలి. ఆ తరువాత 15న 'సాహసం స్వాసగా సాగిపో'.. అదే విధంగా జూలై ఆఖరి వారంలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని రజనీకాంత్ సినిమా ఇప్పుడు 1 నుండి 15వ తారీఖు నాటికి షిఫ్టు అయిపోవడంతో.. (ఇంకా దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదులే).. ఇప్పుడు ఇతర రిలీజుల్లో తేడాలొచ్చేశాయి. జూలై 22న కాని.. 29న కాని బాబు బంగారం సినిమాను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారట. ఒకవేళ కబాలి సూపర్ హిట్టయితే.. బాబు 29న వస్తాడు. కాకపోతే 22నే వచ్చేస్తాడు. ఎందుకంటే వెనుకనే ఆగస్టు 12న జనతా గ్యారేజ్ వచ్చేస్తోంది.
నిజానికి అప్పట్లో బాహుబలి సినిమా వారు నాలుగైదు డేట్లు మార్చడంతో.. ఇలాగే చాలా రిలీజులు తల్లక్రిందులయ్యాయ్. మరి రజనీకాంత్ కూడా అలాగే చేయడం భావ్యం కాదేమో.