Begin typing your search above and press return to search.

అవి ఫేక్‌ ఓట్లని నానికి ముందే తెలుసట!

By:  Tupaki Desk   |   19 Jan 2019 6:17 AM GMT
అవి ఫేక్‌ ఓట్లని నానికి ముందే తెలుసట!
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 పూర్తి అయ్యి నెలలు గడుస్తోంది. సీజన్‌ 3 గురించి మాట్లాడుతున్నారు. అయినా కూడా బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్‌ అడ్డదారిలో గెలిచాడంటూ బాబు గోగినేని ఆరోపిస్తూనే ఉన్నాడు. మొదటి నుండి కూడా కౌశల్‌ న్యాబద్దంగా గెలవలేదని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. కౌశల్‌ ఆర్మీని ముందే క్రియేట్‌ చేసుకుని పెట్టుకున్న కౌశల్‌ ఆర్మీ లోనికి వెళ్లిన తర్వాత తన భార్యతో ఆ ఆర్మీని నడిపించాడని - అందుకోసం చాలా పెద్ద ప్లాన్‌ చేశాడంటూ ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా సంక్రాంతి సందర్బంగా ఆస్ట్రేలియాలో తెలుగు వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నారు. అక్కడ కూడా ఇదే విషయంను బాబు గోగినేని లేవనెత్తాడు.

కౌశల్‌ ఆర్మీని ఆయన భార్య నడిపారంటూ బాబు గోగినేని చేసిన విమర్శలకు కౌశల్‌ భార్య నీలిమ స్పందిస్తూ మీ వద్ద ఆధారాలు ఉంటే చూపండి. లేదంటే మాట్లాడొద్దు అంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమంలోనే బాబు గోగినేని మాట్లాడుతూ సీజన్‌ 2 హోస్ట్‌ నానిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిగ్‌ బాస్‌ లో దొంగ ఓట్లు పడుతున్నాయని నేను మొదటి నుండి చెబుతూ వచ్చాను. నానితో కూడా తాను ఆ విషయాన్ని చెప్పాను. నానికి కూడా ఆ విషయం తెలుసు. కాని నాని ధైర్యం చేయలేక పోయాడు.

బిగ్‌ బాస్‌ ఫైనల్‌ విజేతను మామూలుగా అయితే ఇద్దరు ఫైనలిస్ట్‌ లను చేతులు పట్టుకుని విజేత చేతులు పైకి ఎత్తాల్సి ఉంటుంది. కాని నాని ఆ పని చేసేందుకు ఒప్పుకోలేదు. తాను ఆ పని చేయలేనంటూ మాతో చెప్పాడు. నాని అలా ఎందుకు మాతో చెప్పాడో మీరే అర్థం చేసుకోండి అంటూ బాబు గోగినేని అన్నాడు. డాక్టరేట్‌ స్పెల్లింగ్‌ కూడా సరిగా రాని కౌశల్‌ తనకు గౌరవ డాక్టరేట్‌ వచ్చినట్లుగా చెప్పుకున్నాడంటూ బాబు గోగినేని అన్నాడు.

కౌశల్‌ కు దొంగ ఓట్లు పడ్డాయని ఒక ప్రముఖ మీడియా సంస్థ ఇన్వెస్టిగేషన్‌ లో తేలిందని - కాని ఆ విషయంను బిగ్‌ బాస్‌ నిర్వాహకులు పట్టించుకోకుండా - పరువు పోతుందని సైలెంట్‌ గా ఉంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీజన్‌ 2 పూర్తి అయ్యి ఇన్నాళ్లయినా ఇంకా ఈ గొడవ ఏంటీ అంటూ కొందరు బాబు గోగినేనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాబు గోగినేని విమర్శలకు కౌశల్‌ కూడా ధీటుగానే సమాధానం ఇచ్చాడు. వీరిద్దరి మద్య మాటల యుద్దం తారా స్థాయిని దాటడంతో నిర్వాహకులు కాస్త అడ్డుకున్నారు.