Begin typing your search above and press return to search.

గ్యాప్ దొరికింది..బాబు గోగినేని ఆడేసుకున్నారుగా!

By:  Tupaki Desk   |   28 Feb 2019 4:16 AM GMT
గ్యాప్ దొరికింది..బాబు గోగినేని ఆడేసుకున్నారుగా!
X
కౌషల్ ఆర్మీ! కౌషల్ బిగ్ బాస్ లో ఉండగా కౌషల్ కోసం ఈ ఆర్మీ ఎంత కష్టపడిందో...ఆయన గెలుపులో ఈ ఆర్మీ పాత్ర ఎంత ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ ఆర్మీ సైతం ఫేక్ ఆర్మీ అన్న వార్తలు అపట్లోనే బలంగా వినిపించాయి...కౌషల్ ఇదంతా కావాలనే - బిగ్ బోస్ గెలవడం కోసం చేస్తున్నాడు అంటూ చాలా విమర్శలే వచ్చాయి...కానీ వాటన్నింటినీ పట్టించుకునే అవకాశమే లేదు అప్పట్లో. అయితే ఇదిలా ఉంటే తాజాగా కౌషల్ ఆర్మీకి - కౌషల్ కి మధ్య కాస్త గ్యాప్ రావడంతో ఆ గ్యాప్ ని బాబు గోగినేని చక్కగా ఉపయోగించుకున్నారు...కౌషల్ పై - అతని ఆర్మీ పై విరుచుకు పడ్డారు.

కౌషల్ అండ్ కౌషల్ ఆర్మీపై ఆయన మాట్లాడుతూ...నేను ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను....ఈ ఆర్మీ పెద్ద ఫేక్ అని - ఇదంతా పెయిడ్ ఆర్మీ అని - కానీ నా మాట ఎవ్వరూ వినలేదు....వీళ్ళు "గేమ్ ని గేమ్" లా ఆడకుండా - "గేమ్ లోనే గేమ్" ఆడారు అని - అయితే వాళ్ళు తప్పు చేశారు అని ప్రూఫ్స్ తో సహా నేను నిరూపించినా ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. వీళ్ళు ఎన్నెన్ని మాటలు అన్నారు - గీత మాధురి గారిని - ఆమె భర్తను. ఇంకా చిన్న పిల్ల అయిన దీప్తి సునయన అయితే ఏకంగా చచ్చిపొమ్మని నోటికి వచ్చినట్లు మాట్లాడారు...చివరకు ఈ షో హోస్ట్ చేసిన నాని గారిని కూడా వదలకుండా వియర్శలు చేశారు అని అంటూనే...ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే - వీళ్ళందరూ భాదితులు...వాళ్ళు పోలీస్ కేస్ పెట్టవచ్చు - కానీ ఎందుకు అసలు లీగల్ గా ఫైట్ చెయ్యాలి అని అనుకోవడం లేదు నాకైతే అర్ధం కావడంలేదు అంటూ బాబు గోగినేని తెలిపారు...

అంతేకాదు ఈ రాస్కల్స్ అందరూ ఏదో ఇప్పుడు కౌషల్ తో గొడవ అయ్యింది కనుక తప్పు అంతా అతనిదే అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు..వీళ్ళు అందరూ కూడా మొన్నటి వరకూ ఆ టీమ్ లో సభ్యులే...వీళ్ళు కూడా తప్పు చేసిన వాళ్లే...వీళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని బాబు గోగినేని అన్నారు...మొత్తంగా చూసుకుంటే కౌషల్ పై వస్తున్న ఆరోపణల విషయంలో బాబు గోగినేని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరి దీనికి కౌషల్ అండ్ కౌషల్ ఆర్మీ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూద్దాం.