Begin typing your search above and press return to search.

గ‌రిక‌పాటి ని తాలిబ‌న్ తో పోల్చిన బాబు గోగినేని!

By:  Tupaki Desk   |   15 Oct 2022 10:35 AM GMT
గ‌రిక‌పాటి ని తాలిబ‌న్ తో పోల్చిన బాబు గోగినేని!
X
అవధాని..ప్ర‌వ‌చ‌నా క‌ర్త‌ గరికపాటి నరసింహారావును మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్య‌లు తెలుగు రాష్ర్టాల వ్యాప్తంగా ఎంత‌టి దుమారాన్ని రేపాయో తెలిసిందే. మెగా అభిమానుల‌ల‌తో పాటు మెగాహీరోల్ని వ్య తిరేకించే రాంగోపాల్ వ‌ర్మ సైతం ఈ విష‌యంలో గ‌రిక‌పాటిపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌రిక పాటిని వ‌ర్మ టార్గెట్ చేసిన విధానం చూసి రివ‌ర్స్ లో మెగా అభిమానుల‌పై రివ‌ర్స్ పంచా? అన్న సందేహాలు సైతం తెర‌పైకి వ‌చ్చాయి.

మెగా ఫ్యాన్స్‌ని రివర్స్‌లో ట్రోల్ చేస్తున్నాడని చాలా మంది అనుకున్నారు. కానీ వాస్తవానికి దర్శకుడి ట్వీట్లు మరియు వివిధ మీడియా వ్యక్తుల ప్రతిచర్యలు ఇప్పుడు అవధానిని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. గరికపాటి గారు ఆధ్యాత్మిక వ్యక్తో.. దేవుడో... మత నాయకుడో కాదని.. తక్షణ తెలుగు కవిత్వంలో మేధావి మాత్రమేనని ఆయన చేసిన వ్యాఖ్యలపై   పలువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

తాజాగా ఈ రేసులోకి  మాన‌వ‌హ‌క్కుల కార్య‌క‌ర్త బాబు గోనినేని కూడా దిగిపోయారు. ఆయ‌న గ‌రిక‌పాటిపై త‌న‌దైన శైలిలో విమర్శ‌లు గుప్పించారు. మహిళలపై.. అత్యాచారాలపై గరికపాటి నరసింహారావు గ‌తంలో చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసారు. అనుష్కను చూస్తుంటే గుండె దడదడలాడుతుందన్న అసభ్యకర వ్యాఖ్యలు వంటికి  రుచించవని గ‌రిక పాటిని ఉద్దేశించి  గోగినేని అభిప్రాయపడ్డారు.

నరసింహారావు  తెలుగు తాలిబాన్‌లా కనిపిస్తున్నారని..ఆయన మూర్ఖత్వం.. మహిళలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని అధికారులను అభ్యర్థించినట్లు గోగినేని అభిప్రాయపడ్డారు. గరికపాటి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పేరును కూడా స‌రిగ్గా  ఉచ్చరించలేడు. కానీ శాస్త్రీయ సిద్ధాంతాల గురించి మాత్రం లెక్చ‌ర్లు ఇస్తారు.

ఇలాంటి వ్యాఖ్య‌లు త‌గ‌వు అని గోగినేని మండిప‌డ్డారు. మొత్తానికి చ‌ల్లారింది అనుకుంటోన్న మంట‌పై బాబిగోనేని మ‌ళ్లీ నిప్పు పెట్టిన‌ట్లే క‌నిపిస్తున్నారు. ఈ విష‌యంలో ఇప్ప‌టికే చిరంజీవి-గ‌రిక‌పాటి కూడా వివ‌ర‌ణ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవిని గ‌రిక‌పాటి కించాప‌ర‌చాల‌ని ప్ర‌య‌త్నించినా...చిరు మాత్రం పెద్దాయ‌న అంటూ ఎంతో గౌర‌వంగా స్పందించి మ‌రోసారి త‌న వ్య‌క్తిత్వాన్ని చాటుకున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.