Begin typing your search above and press return to search.

'ఎందుకయ్యా నీకు అంత ఫ్రస్ట్రేషన్'

By:  Tupaki Desk   |   30 Sep 2021 3:30 PM GMT
ఎందుకయ్యా నీకు అంత ఫ్రస్ట్రేషన్
X
'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ ఆన్లైన్ టికెట్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ.. ముఖ్యమంత్రి మంత్రులను ఉద్దేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రులు - సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి వంటి వారు పవన్ కామెంట్స్ ని ఖండిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో పోసాని అభ్యంతరకర వ్యాఖ్యలతో పవన్ మీద విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యవహారమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. పవన్ కు సపోర్టుగా ఒకరిద్దరు ముందుకు వస్తే.. ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదంటూ టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ - సినీ ప్రముఖులు అంటున్నారు. తాజాగా పవన్ వ్యాఖ్యల మీద సీనియర్ నటుడు బాబూ మోహన్ ఘాటుగా స్పందించారు.

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) ఎన్నికలలో మంచు విష్ణు ప్యానల్ తరపున ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న జరగనున్న ఎన్నిక కోసం ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. పవన్ - పోసాని ఇద్దరూ ఇండస్ట్రీ పరువు పోకుండా వ్యవహరించాల్సిందని అన్నారు. ''ప్రభుత్వ సహకారం ఇండస్ట్రీకి అవసరం. ఏపీ ప్రభుత్వాన్ని సినీ ప్రముఖులు ఓ విషయం అడిగారు. దానికి వాళ్ళు సరే అన్నారు. దాన్ని విమర్శించి అది చిన్నోళ్లకు ఉపయోగపడుతుంది పెద్దోళ్లకు ఉపయోగపడదు అంటూ పవన్ ఏదేదో మాట్లాడారు'' అని బాబు మోహన్ అన్నారు.

''పవన్ కల్యాణ్ అన్ని మాటలు మాట్లాడారు కదా.. ఆయన తేల్చుకోవాలి.. ఇండస్ట్రీ బాగుంటే మనందరం బాగుంటాం. ఆయన ఇండస్ట్రీ సైడా? ప్రకాశ్ రాజ్ సైడా? అనేది ముందుగా పవన్ కల్యాణ్ తేల్చుకోవాలి. ఇండస్ట్రీ బాగుండలా? ప్రకాష్ రాజ్ బాగుండాలా? అని మంచు విష్ణు ప్రశ్నించారు. ఇండస్ట్రీ అంటే ఫేస్.. ఏదున్నా మన ఫేస్ లో కనిపించకూడదు. తెరచాటునే అన్ని విషయాలు తేల్చుకోవాలి. చింపిరి జుట్టు వేసుకొని తెర మీదకు వస్తే పిచ్చివాడిలా కనిపిస్తాం. ఇప్పుడు అదే అనిపించుకుంటున్నాం. అది వద్దు అనే నేను చెబుతున్నా'' అని బాబు మోహన్ తెలిపారు.

ఇంకా బాబూ మోహన్ మాట్లాడుతూ.. ''నీ వ్యక్తిగతమా?, నీ సొమ్ము తిన్నాడా?, నీ రెమ్యూనరేషన్ గుంజుకున్నాడా? నీ అవకాశాన్ని తీసుకున్నాడా? ఎందుకయ్యా నీకు అంత ఫ్రస్ట్రేషన్. ఓ అంటూ ఊగిపోవడం ఎందుకు? చక్కగా నవ్వుతూ మాట్లాడుకోవచ్చు కదా. ఏదో నీ ఇల్లు గుంజుకొని ఇల్లు కాలబెట్టి.. నీ బ్యాంక్ బ్యాలన్స్ అంతా తీసుకున్నట్లు. పది పైసల నష్టం అయినా జరిగిందా నీకు? వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల మన సినిమా ఇండస్ట్రీ పరువు పోతోంది. సినిమా యాక్టర్స్ అంటే ఇదా అని అందరూ అంటున్నారు. నీకు అంత పెద్ద అవమానం - అన్యాయం - ద్రోహం జరిగితే ఎందుకు పెద్ద మనుషులతో కూర్చొని సాల్వ్ చేసుకోకూడదు?'' అని అన్నారు.