Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బేబీ షవర్లో ఇది మెగా ఫ్రేమ్

By:  Tupaki Desk   |   19 Nov 2018 12:45 PM GMT
ఫోటో స్టొరీ: బేబీ షవర్లో ఇది మెగా ఫ్రేమ్
X
చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ ప్రెగ్నెన్సీ వార్త మెగా ఫ్యామిలీ మొత్తాన్ని సంతోషంతో నింపిన విషయం తెలిసిందే. శ్రీజకు ఇప్పటికే మొదటి వివాహం ద్వారా ఎనిమిదేళ్ళ పాప ఉంది. డైవోర్స్ తర్వాత శ్రీజ 2016 లో కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది. ఈ జంట ఇప్పుడు తల్లిదండ్రులు కానున్నారు. ఈమధ్యే శ్రీజకు గ్రాండ్ గా సీమంతం జరిగింది.

ఈ ఫంక్షన్ కు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరయ్యరు. పెద్దవాళ్ళందరూ శ్రీజకు తమ ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఈ ఫంక్షన్ ఫోటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అన్ని ఫోటోలలో హైలైట్ మాత్రం శ్రీజ తన అన్న వదినలైన చరణ్ - ఉపాసన తో కలసి తీయించుకున్నదే. అఫ్ కోర్స్ .. సేమ్ ఫ్రేమ్ లో కళ్యాణ్ దేవ్ కూడా ఉన్నాడు లెండి. చరణ్ మాత్రం అయ్యప్ప దీక్ష దుస్తులలో కాస్త గంభీరంగా ఉన్నాడు కానీ చెల్లి శ్రీజ మొహం ఫుల్ గా వెలిగిపోతోంది. ఉపాసన కూడా మంచి స్మైలింగ్ ఫేస్ తో నిలబడింది.

ఫోటో ఫ్రేమ్ డిజైన్ కు ఓ.. బేబీ అని రాసి ఉంది. ఈ బేబీ ఫ్యామిలీలోకి వస్తే చిరు మరోసారి తాతగారు అవుతారు.. చరణ్ మరో సారి మేనమామ అవుతున్నాడన్నమాట.