Begin typing your search above and press return to search.

వీడియో సాంగ్ : సాహో ప్రేమికా

By:  Tupaki Desk   |   26 Aug 2019 3:48 PM IST
వీడియో సాంగ్ : సాహో ప్రేమికా
X
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానున్న సాహో మీద ఎగ్జైట్ మెంట్ అంతకంతకూ పెరిగిపోతున్న టైంలో యువి టీమ్ ఇవాళ మరో స్పెషల్ గిఫ్ట్ అందజేసింది. బేబీ వోంట్ యు టెల్ మీ అంటూ సాగే ఈ స్వీట్ మెలోడి సాంగ్ ని వీడియో సాంగ్ రూపంలో విడుదల చేసింది. శంకర్ ఎహసాన్ లాయ్ ద్వయం సంగీతం సమకూర్చగా శ్వేతా మోహన్ - సిద్ధార్థ్ మహదేవన్ - శంకర్ మహదేవన్ గాత్రం అందించగా కృష్ణకాంత్ సాహిత్యం సమకూర్చాడు.

మెల్లగా వింటూ రిపీట్ మోడ్ లోకి వెళ్లేలా చేస్తున్న ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది. ఎక్కువ రణగొణ ధ్వని లేకుండా సింపుల్ ఆర్కెస్ట్రైజేషన్ తో శంకర్ ఎహసాన్ లాయ్ లు కంపోజ్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఆల్బమ్ లో వీళ్ళు కంపోజ్ చేసినా పాట ఇదొక్కటే.

ఇక మిగిలిన విషయాలకు వస్తే ప్రభాస్ శ్రద్ధా కపూర్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. జీవితంలో ఏదో మిస్ అవుతున్న హీరోయిన్ కు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో హీరో తనను ఎన్నడూ చూడని అరుదైన లొకేషన్లకు తీసుకెళ్లడం పాట ఉద్దేశంగా అర్థమవుతోంది.

ఈ ప్రయాణంలోనే ఇద్దరి మధ్య ప్రేమ ఎంత ఘాడంగా ఉందో ఒకరినొకరు అర్థం చేసుకునే దిశగా సాగుతుంది. చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రేమ జంట షికారులో వీళ్ళ మధ్య మురళి శర్మ ఎందుకు ఉండాల్సి వచ్చిందన్నది సస్పెన్స్. ఓ షాట్ లో కారులో నిద్రపోతున్న ఆయన కనిపిస్తారు. మొత్తానికి సాహోలోనే బెస్ట్ మెలోడీ ఇవాళ వచ్చేయడంతో అభిమానులకు స్పెషల్ బోనస్ అందినట్టు అయ్యింది