Begin typing your search above and press return to search.

అమితాబ్ బచ్చన్ ఆంతేమ్.. పూరి కొడుకు బడా ప్లాన్

By:  Tupaki Desk   |   15 Jun 2022 11:38 AM GMT
అమితాబ్ బచ్చన్ ఆంతేమ్.. పూరి కొడుకు బడా ప్లాన్
X
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అతను ఇప్పటివరకు చేసిన సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. నటుడిగా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా అతనికి సరైన కథలు తరగడం లేదు అని చెప్పాలి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమా తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే.

ఇక ఆ తర్వాత రొమాంటిక్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ అది కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు చోర్ బజార్ సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఆకాష్ పూరి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు.

అయితే ఈ ప్రాజెక్ట్ పై పూరి జగన్నాథ్ ప్రమేయం ఏ మాత్రం లేకుండా ఆకాష్ తనకు సినిమాను ప్రమోట్ చేసుకునే విధంగా అడుగులు వేస్తున్నాడు. జార్జి రెడ్డి దర్శకుడు జీవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్వరలోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.

అయితే సినిమాకు సంబంధించిన సాంగ్స్ కూడా జనాలకు చేరువయ్యేలా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక రీసెంట్ గా మంగ్లీ తో ప్రత్యేకంగా పాడిన అమితాబ్ బచ్చన్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. అమితాబచ్చన్ అభిమానిగా ప్రత్యేకంగా ఆయన పేరు మీద ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయడం బాగానే ఉంది.

ఇక రవితేజ ఈ పాటను ప్రత్యేకంగా లాంచ్ చేశాడు..మదీన్ మ్యూజిక్, మంగ్లీ గానం, మట్టపల్లి సుధాకర్ రచనకు ఆడియెన్స్ అయితే పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

ఈ పాట ఒకవైపు మాస్ ఆడియన్స్ ను మరొకవైపు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ పాట అయితే ఆకాష్ పూరి చోర్ బజార్ సినిమా పై మంచి వైబ్రేషన్స్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్న ఆకాష్ కు స్టార్టింగ్ అయితే మంచి బజ్ క్రియేట్ అవుతుంది. మరి సినిమా విడుదల తర్వాత ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.