Begin typing your search above and press return to search.
అఫిషియల్ : బ్యాచిలర్ కలెక్షన్స్.. ఏజెంట్ అప్‌డేట్
By: Tupaki Desk | 19 Oct 2021 7:31 AM GMTఅక్కినేని ప్రిన్స్ 'అఖిల్' సినిమాతో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. కాని కమర్షియల్ బ్రేక్ మాత్రం ఇప్పటికి దక్కింది. ఆయన హీరోగా నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కమర్షియల్ గా హిట్ అనే టాక్ ను దక్కించుకుంది. నాల్గవ రోజు కూడా వసూళ్లు స్టడీగా రావడంతో 70 శాతం వసూళ్లు నమోదు అయ్యాయి. లాంగ్ రన్ లో మిగిలిన 30 శాతం వసూళ్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయం అంటున్నారు. దసరా సందర్బంగా వచ్చిన ఇతర సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక పోతున్నాయి. కనుక అది బ్యాచిలర్ కు కలిసి వచ్చే అంశంగా మారింది. ఈ వారంతం వరకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ బ్రేక్ ఈవెన్ సాధించడం మాత్రమే కాకుండా మొదటి సారి అఖిల్ సినిమా లాభాల్లోకి వెళ్లబోతుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు బ్యాచిలర్ 70 శాతం వసూళ్లను రికవరీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. నాల్గవ రోజు కూడా మంచి వసూళ్లు నమోదు అవ్వడంతో ముందు ముందు మరింత భారీ వసూళ్లు నమోదు అవ్వబోతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా తో ఆరు ఏళ్లుగా ఎదురు చూస్తున్న బ్రేక్ అఖిల్ కు వచ్చిందని.. ఈ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడం ద్వారా మొదటి విజయాన్ని సొంతం చేసుకున్న అఖిల్ ఇకపై జోరుగా ముందుకు పరుగులు తీయడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. బ్యాచిలర్ ఇచ్చిన సక్సెస్ జోష్ తో ఈనెల 26 నుండి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ సినిమా చిత్రీకరణ లో అఖిల్ పాల్గొనబోతున్నాడు. అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన సమయంలో లాంగ్ హెయిర్ మరియు స్టైలిష్ లుక్ ఇంకా మంచి ఫిజిక్ తో ఆకట్టుకున్నాడు. అదే లుక్ లో ఏజెంట్ లో కనిపించబోతున్నాడు. తెలుగు లో మొదటి బాండ్ సినిమా అంటూ ఈ సినిమా పై అభిమానులు నమ్మకం పెంచుకుంటున్నారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుంది అనే నమ్మకంతో భారీ ఎత్తున బడ్జెట్ ను పెడుతున్నారు.
అఖిల్.. సురేందర్ రెడ్డిల కాంబోలో రూపొందుతున్న ఏజెంట్ ను ఏకంగా 50 కోట్లతో నిర్మిస్తున్నారట. బ్యాచిలర్ సినిమా సక్సెస్ అయ్యి మంచి వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో ఏజెంట్ కు 50 కోట్లు రిస్క్ ఏమీ కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సురేందర్ రెడ్డి కెరీర్ లో మంచి హిట్స్ ఉన్నాయి. కనుక ఈ సినిమా ఖచ్చితంగా అఖిల్ కు రెండవ కమర్షియల్ సక్సెస్ ను కట్టబెడుతుందనే నమ్మకంను మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ ఏజెంట్ కోసం పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. బరువు తగ్గడం మొదలుకుని సిక్స్ ప్యాక్ ఇంకా స్టైలిష్ లుక్ డాన్స్ ఫైట్స్ ఇలా అన్ని విషయాల్లో కూడా కష్టపడుతున్నాడు. అందుకే ఏజెంట్ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. బ్యాచిలర్ సక్సెస్ కనుక స్పీడ్ గా ముగించి వచ్చే సమ్మర్ కే ఏజెంట్ ను దించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ అక్కినేని వర్గాల వారు అంటున్నారు. ఏజెంట్ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో టీజర్ కూడా వస్తుందేమో చూడాలి.