Begin typing your search above and press return to search.

నాగ‌చైతన్య ఇంకా బ్ర‌హ్మ‌చారే అంట‌!

By:  Tupaki Desk   |   26 July 2018 10:52 AM GMT
నాగ‌చైతన్య ఇంకా బ్ర‌హ్మ‌చారే అంట‌!
X
సమంత‌తో సుదీర్ఘ‌కాలం ప్రేమాయ‌ణం న‌డిపి ఆ త‌ర్వాత ఆమెని పెళ్లి చేసుకొన్నాడు నాగ‌చైత‌న్య‌. ఈ లెక్కన చూస్తే బ్ర‌హ్మ‌చ‌ర్యం నుంచి నాగ‌చైత‌న్య ఎప్పుడో బ‌య‌టికొచ్చేసిన‌ట్టే. అభిమానులు ఫ్యామిలీమేన్‌ లానే చూస్తున్నారు చైతూని. కానీ ఆయ‌న మాత్రం నేనింకా బ్ర‌హ్మ‌చారే - నాలో ఇంకా బ్ర‌హ్మాచారి బ‌తికే ఉన్నాడ‌ని చెబుతున్నాడు. నాగ‌చైత‌న్య మాట‌ని స‌పోర్ట్ చేస్తూ ఆయ‌న భార్య స‌మంత కూడా `నా భ‌ర్త చెప్పింది నిజ‌మే` అంటూ సెల‌విచ్చింది. టాలీవుడ్‌ కి చెందిన అంద‌మైన జంట‌గా గుర్తింపు తెచ్చుకొన్న వీళ్ల స‌ర‌దాల‌కి ట్విట్ట‌ర్ వేదికైంది. నాగ‌చైత‌న్య‌కి వ‌ర‌స‌కి బావ అయిన సుశాంత్ త్వ‌ర‌లోనే `చిల‌సౌ`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

ఆ సినిమాకి నాగ‌చైత‌న్య - స‌మంతలు అండ‌గా నిలుస్తున్నారు. ప్ర‌మోషన్స్‌ లో భాగంగా సుశాంత్ ఇటీవ‌ల ఆన్‌ లైన్‌ లో కుర్రాళ్ల‌కి స‌ర‌దాగా ఓ కాంటెస్ట్ పెట్టాడు. పెళ్లిని పోస్ట్‌ పోన్ చేయ‌డం కోసం స‌రైన కార‌ణం చెబితే, అది మాకు న‌చ్చితే మీకు ముందుగానే మా చిల‌సౌ సినిమాని చూపించి - ఆ త‌ర్వాత మంచి పార్టీ కూడా ఇస్తామ‌ని సెలవిచ్చాడు సుశాంత్‌. దీన్ని బ్యాచిల‌ర్ పార్టీ అని సంబోధించాడు సుశాంత్. అది చూసిన నాగ‌చైత‌న్య `నేను లేకుండా పార్టీ చేసుకుంటావా ఏంటి? న‌న్ను మ‌రిచిపోయిన‌ట్టున్నావు. నాలో ఇంకా బ్ర‌హ్మ‌చారి బ‌తికే ఉన్నాడు` అంటూ ట్వీట్ చేశాడు చైతూ. `నువ్వే క‌దా ఈ ఈ పార్టీ ఇచ్చేది. నిన్నెలా మ‌రిచిపోతా. కాక‌పోతే స‌మంత‌కి చెప్పి రా` అంటూ సుశాంత్ బ‌దులిచ్చాడు. అది చూసిన స‌మంత రిప్టై ఇస్తూ నా భ‌ర్త చెప్పింది నిజ‌మే, త‌ను బ్యాచిల‌రే అంది. ఇదంతా నెటిజ‌న్ల‌కి మంచి వినోదాన్ని పంచింది.