Begin typing your search above and press return to search.
దగ్గుబాటి వారసుడికి కరోనా కష్టాలు...!
By: Tupaki Desk | 17 April 2020 8:35 AM GMTదగ్గుబాటి వారసుడిగా టాలీవుడ్ లోకి 'లీడర్' సినిమాతో పరిచయమయ్యాడు రానా. కెరీర్ స్టార్టింగ్ నుండి కేవలం కథా బలమున్న చిత్రాలలో మాత్రమే నటిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఒకవైపు హీరోగాను మరోవైపు విలన్ గా నటిస్తూ సత్తా చాటుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో భళ్లాలదేవుడుగా రానా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నుంచి రానా ఎప్పుటికప్పుడు విభిన్న పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెలుగు తమిళ హిందీ భాషల్లో 'అరణ్య' అనే పాన్ ఇండియా రూపొందిస్తున్నారు. ప్రభు సాలోమన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం తెలుగులో 'అరణ్య'.. తమిళంలో 'కాదన్'.. హిందీలో 'హాథీ మేరే సాథీ'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. మానవులు - జంతువులను ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రానా అడవిలో నివసించే ఆదివాసి 'బన్ దేవ్' పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇక్కడి దాకా అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో కరోనా వచ్చి మనోడి మీద దెబ్బేసింది.
వివరాల్లోకి వెళ్తే ఎంతో కష్టపడి.. ఎంతో ఖర్చు పెట్టి 'అరణ్య' సినిమా తీస్తే కరోనా మహమ్మారి దెబ్బకి ఈ సినిమాకి ఇప్పుడప్పుడే సోలో రిలీజ్ డేట్ దొరికే అవకాశం కనిపించడం లేదంట. 'ఘాజీ' సినిమా మాదిరిగా పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టేద్దాం అనుకున్న రానాకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ సినిమా ప్రొడక్షన్ లో పెట్టిన పెట్టుబడి చాలా వరకు రానా ఎకౌంట్ నుంచే ట్రాన్సఫర్ అయినట్లుగా సమాచారం. దీనికి ఇప్పుడు వడ్డీతో కలిపి రాబట్టాలంటే ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా బ్రేక్ ఈవెన్ కావాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. లాక్ డౌన్ ఎత్తేసి థియేటర్లు మళ్లీ తెరుచుకున్నా ఆల్రేడీ క్యూలో ఉన్న సినిమాలతో.. ఈ గ్యాప్ ని సంపూర్తిగా వాడుకొని రిలీజ్ కి రెడీ అయిన సినిమాలతో.. 'అరణ్య' పోటీ పడటం చాలా కష్టమైన విషయమే. అంతే కాకుండా మాస్ సెంటర్స్ లో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించకపోవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ డీగ్లామర్ సినిమాకి ఉన్న మెయిన్ ఎట్రాక్షన్ అడివిలో రానా చేసే సాహసాలే అట. మరి రానా చేసే సాహసాలు థియేటర్ కు జనాల్ని ఎంతవరకు తీసుకురాగలుగుందో.. ఎంత వరకు వసూళ్లు రాబడుతుందో అనేది చూడాలి. ఏదేమైనా రానాకి ఇది కచ్ఛితంగా బ్యాడ్ టైమ్ అనే చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా రానా 'అరణ్య' చిత్రం అనంతరం వేణు ఉడుగుల దర్శకత్వం లో నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ 'విరాట పర్వం' సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నది.