Begin typing your search above and press return to search.
ట్రెండింగ్: చందమామ బ్యాడ్ లక్
By: Tupaki Desk | 18 April 2019 12:32 PM GMTఅందాల చందమామ కాజల్ గత కొంతకాలంగా సెలక్టివ్ గా సినిమాలకు సంతకాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ కథలు.. అందాల ఆరబోతకు ఆస్కారం ఉండేవి పూర్తిగా దూరం పెట్టేసిన కాజల్ నాయికగా తనని తాను నిరూపించుకునే కథాంశాల్ని మాత్రమే ఎంచుకుంటున్నారు. అ! లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయాలని ఉంటుందని కాజల్ అప్పట్లో తెలిపారు. ఆ తర్వాత యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కమర్షియల్ సినిమాల్లో నటించినా కమల్ హాసన్ లాంటి గ్రేట్ స్టార్ సరసన భారతీయుడు 2 చిత్రానికి సంతకం చేశారు.
అయితే తన దురదృష్టమో ఏమో.. ఈ సినిమా ప్రారంభమైనా ఆది నుంచి ఏవో అడ్డంకులు ఇబ్బ ందికరంగా మారాయి. భారతీయుడు 2 ఇప్పటికే రెండు మూడు సార్లు చిత్రీకరణ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఓసారి బడ్జెట్ పరంగా దర్శకుడు శంకర్ తో లైకా సంస్థకు ఏకాభిప్రాయం కుదరక ఆపేశారు. మరోసారి కమల్ హాసన్ కి లేటెస్ట్ ప్రోస్థటిక్స్ మేకప్ సూట్ కాకపోవడం వల్లనా నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల వల్ల కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఆ క్రమంలోనే లైకా సంస్థ మిడిల్ డ్రాప్ అయ్యిందని.. ఇక భారతీయుడు 2 సెట్స్ కి వెళ్లదని తమిళ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇప్పటికీ లైకా సంస్థ బడ్జెట్ల విషయమై పునరాలోచిస్తోందట. అయితే శంకర్ మాత్రం ఎట్టిపరిస్థితిలో లైకా బృందాన్ని కన్విన్స్ చేయాలని భావిస్తున్నారని వార్తలొచ్చాయి. ఒకవేళ లైకా సంస్థకు కుదరని పక్షంలో వేరొక పెద్ద కార్పొరెట్ సంస్థతో టైఅప్ పెట్టుకుని భారతీయుడు 2 చిత్రాన్ని సెట్స్ కి తీసుకెళ్లాలని శంకర్ భావిస్తున్నారట.
కారణం ఏదైనా `భారతీయుడు 2`లో అవకాశం అందుకున్న కాజల్ ని మాత్రం దురదృష్టం వెంటాడిందనే చెప్పాలి. కమల్ హాసన్ లాంటి విలక్షణ నటుడి సరసన తొలి అవకాశం.. అలాగే శంకర్ లాంటి జాతీయ స్థాయి కరిష్మా ఉన్న దర్శకుడితో పని చేసే గ్రేట్ ఛాన్స్ రెండిటినీ మిస్సవుతోంది. ఈ సినిమా కోసం కళరియ పట్టు అనే అరుదైన విద్యను కాజల్ నేర్చుకుంది. ఇలాంటప్పుడు సినిమా మధ్యలోనే ఆగిపోతే అది దురదృష్టం అనే చెప్పాలి. శంకర్ స్టైల్ భారీ తనం నిండిన సినిమాలో అవకాశం దక్కడం అంత సులువేం కాదు. అరుదైన దక్కింది అంటే ఇలా ఆదిలోనే హంసపాదు ఇబ్బ ందికరంగా మారింది. ప్రస్తుతానికి కమల్ హాసన్ - శంకర్ ద్వయం పట్టుదలగానే ఉన్నారు. కానీ లైకా సంస్థనే ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టేందుకు వెనకాడుతోందిట. పైగా కమల్ హాసన్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉండడం వల్లనూ ఆలోచనలో పడ్డారని తమిళ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇక అన్నిటికీ సమాధానం ఈ ఎన్నికలు పూర్తయ్యాక లభిస్తుందని చెబుతున్నారు.