Begin typing your search above and press return to search.
స్టార్ హీరోలకు కలిసిరాని 2021
By: Tupaki Desk | 23 Dec 2021 12:30 PM GMT2021 స్టార్ హీరోలకు కలిసిరాలేదా? అంటే వారి అభిమానులు మాత్రం నిజమే అంటూ ఈ ఏడాదిని రివైండ్ చేసుకుంటున్నారు. కొంత మంది స్టార్ హీరోలకు ఈ ఏడాది కరోనా గట్టి దెబ్బే కొట్టింది. దాని కారణంగా తమ చిత్రాలని ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకురాలేకపోయారు. రిలీజ్ లు ప్రకటించినా కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభించడంతో చేసేది లేక తమ సినిమాలని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఈ ఏడాది అత్యధిక శాతం స్టార్ హీరోల చిత్రాలు థియేటర్ ని చూడలేకపోయాయి.
అలా తమ చిత్రాలని చవరి వరకూ వాయిదా వేస్తూ వచ్చిన హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . ఈ ఇద్దరు నటించిన చిత్రాలేవీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేదు. `RRR`ఎట్టిపరిస్థితుల్లో వస్తుందని ప్రచారం జరిగినా కోవిడ్ కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ జనవరికి అంటే వచ్చే ఏడాదికి మార్చాల్సి వచ్చింది. వచ్చే ఏడాది జనవరి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల `RRR` తో మొదలుకాబోతోంది. ఈ సినిమా వీరిద్ది అభిమానులకే కాదు సినీ ప్రియులకు పండగ వాతావరణాన్ని వారం రోజుల ముందే తీసుకురాబోతోంది.
ఈ ఇద్దరు హీరోలతో పాటు మహేష్ సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాలేదు. గత ఏడాది జనవరిలో సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో ప్రేక్షకులను పలకరించారు మహేష్ . కానీ ఈ ఏడాది మాత్రం నిరాశ పరిచారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో `సర్కారు వారి పాట` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాని మరో స్టార్ ప్రభాస్. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ వచ్చే ఏడాది ప్రారంభం నుంచే ప్రభాస్ `రాధేశ్యామ్`తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఆ తరువాతే వరుసగా `ఆది పురుష్`, `సలార్` చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.
ఒకే ఏడాది ప్రభాస్ మూడు సినిమాలతో రాబోతుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఏడాది ఫ్యాన్స్ ని నిరాశ పరిచారు.అయితే ఆయన సమకాలికులైన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఈ ఏడాది తమ అభిమానులని సంతోష పెట్టారు. నాగ్ వైల్డ్ డాగ్ లో వస్తే బాలయ్య `అఖండ`తో అఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. విక్టరీ వెంకటేష్ నారప్ప, దృశ్యం -2 చిత్రాలతో అదరగొట్టారు.
మెగాస్టార్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో `ఆచార్య`తో సందడి చేయబోతున్నారు ఆ వెంటనే గాడ్ ఫాదర్, భోళా శంకర్ బ్యాక్ టు బ్యాక్ విడుదల కానున్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ ఏడాది సందడి చేయలేకపోయాడు. కేవలం `లైగర్`కే లాక్ అయిపోవడంతో తన నుంచి ఈ ఏడాది ఏ సినిమా రాలేదు. ఇక మిగతా హీరోలు చాలా వరకు థియేటర్లలో సందడి చేయలేకపోయారు అందర గురి ఇప్పుడు 2022పైనే వుంది.