Begin typing your search above and press return to search.
అందమైన పాపకు అదృష్టం కాస్త దూరం!
By: Tupaki Desk | 7 Sep 2019 5:30 PM GMTఒక్కోసారి అంతే. లక్కు మన వైపు ఉండదు. అప్పుడు ఇరవై నాలుగు గంటలూ పనిచేసినా.. మూడువందల అరవై ఐదు రోజులూ కష్టపడ్డా ఫలితం 'గుండు సున్నా' అన్నట్టుగా ఉంటుంది. పాపం బ్యూటీ మేఘ ఆకాష్ పరిస్థితి ప్రస్తుతం అలానే ఉంది. మేఘ డెబ్యూ సినిమా 'ఎనైనోకి పాయుం తూటా'(తెలుగులో 'తూటా') అనే సంగతి తెలిసిందే. అదేంటి.. ఆ సినిమా ఇంకా విడుదలే కాలేదు కదా అంటారా? అవును. విడుదలై ఉంటే డెబ్యూ కావాల్సిన సినిమా!
కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మేఘ టాలెంట్ గురించి ఇండస్ట్రీలో మంచి టాక్ రావడంతో 'లై'.. 'ఛల్ మోహన్ రంగ' సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. కానీ ఆరెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి. అయితేనేం.. తమిళంలో వరసబెట్టి అవకాశాలు వచ్చాయి. వాటిలో రజనీకాంత్ 'పేట' ఒకటి. ఇక హిందీలో కూడా 'శాటి లైట్ శంకర్' సినిమాతో డెబ్యూ ఇస్తోంది. అంతా బాగానే ఉంది కానీ 'తూటా' కు మాత్రం మోక్షం కలగలేదు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి క్లాస్ ఫిలిం మేకర్.. ధనుష్ లాంటి పెద్ద స్టార్ హీరో కాంబినేషన్లో సినిమా.. మేఘకు మంచి ప్రాజెక్టే. కానీ రిలీజ్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటోంది. రీసెంట్ గా సెప్టెంబర్ 6 న విడుదల చేస్తామని అన్నారు అదీ మిస్సు.
పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసినా సినిమా రిలీజ్ కావడం లేదు అంటే దాన్ని బ్యాడ్ లక్ అనకుండా ఏమనాలి? అయినా కొంతమంది "లక్.. బ్యాడ్ లక్ లేదు. అంతా ట్రాష్" అని అపర మేథావుల్లా స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. అయితే అలాంటివారిపై కూడా లక్కు ఒకసారి లుక్కేస్తుంది.. ఒంగోబెట్టి నాలుగు గుద్దులు గుద్ది బ్యాడ్ లక్ కు అప్పగించి తుర్రుమని పారిపోతుంది. అప్పుడు కానీ సదరు మేథావులకు తత్త్వం బోథపడదు. అప్పుడే వారు న్యూమరాలజీలు.. ఆస్ట్రాలజీలు.. జెమాలజీలు.. జఫ్ఫాలజీలు అన్నీ నమ్ముతారు. కనుక ఇందు మూలంగా అందరికీ తెలియజేసేదేమనగా మేఘకు 'తూటా' విషయంలో లక్కు కొంచెం దూరంగా ఉంది. దీన్నే మరో కోణంలో చెప్పుకుంటే గౌతమ్ మీనన్ బ్యాడ్ లక్కు అటు మేఘకు ఇటు ధనుష్ కు లక్కలా అంటుకుంది..!