Begin typing your search above and press return to search.
పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!
By: Tupaki Desk | 20 Oct 2021 1:23 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రజా క్షేంత్రంలోకి వెళ్లిన తర్వాత రాజకీయాలకే సమయం కేటాయిస్తానని చెప్పిన పవన్ అనూహ్యంగా యూ టర్న్ తీసుకున్నారు. ఆ తర్వాత డబ్బులు కోసమే సినిమాలు చేస్తున్నానని..పొట్టగడవడం కోసమే సినిమాలని క్లారిటీ ఇచ్చారు. దీంతో అప్పటివరకూ పవన్ పై బోలెడన్న సందేహాలుండేవి. ముందు సినిమాలు మానేస్తానన్నారు? ప్యాకప్ చెప్పిన ముఖానికి మళ్లీ మేకప్ ఏంటని? కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి విమర్శకులు పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించాల్సి వచ్చింది. అలా పవన్ మళ్లీ `వకీల్ సాబ్ `తో కంబ్యాక్ అయ్యారు.
ఆ వెంటనే వరుసగా మూడు నాలుగు ప్రాజెక్ట్ ల్ని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` తో పాటు యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర తో కలిసి `భీమ్లా నాయక్` సినిమా చేస్తున్నారు. రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అవి పూర్తికాగానే హరీష్ శంకర్ దర్శకత్వంలో `భవదీయుడు భగంత్ సింగ్` షూటింగ్ లో పాల్గొంటారు. మరి ఆ తర్వాత సినిమాలు కొనసాగిస్తారా? అంటే లేదనే సమాచారం అందుతోంది. ఈ మూడు పూర్తి చేసి రిలీజ్ చేయడానికి వచ్చే ఏడాది ద్వితియార్థం వచ్చేస్తుంది. ఆ తర్వాత పవన్ కి సినిమాలు చేసే ఆలోచన లేదుట.
వచ్చే ఏడాది నుంచి మళ్లీ పూర్తిగా ఏపీ రాజాకీయాల్నే టార్గెట్ చేయాలని ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వంపై టీడీపీ పనిగా పెట్టుకుని మరీ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కూడా రంగంలోకి దిగాలని చూస్తున్నారుట. ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్దం అవ్వాలంటే సినిమాలు చేస్తుంటూ కూర్చుంటే కుదరదని..రాజకీయంగా బలంగా తయారవ్వాలంటే అందుకు ఎలా రాటు దేలాలి? అన్న అంశంపైనే ఫోకస్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.