Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ కి రిలీజ్ విషయంలో బ్యాడ్‌ న్యూస్‌!

By:  Tupaki Desk   |   29 Oct 2022 11:30 PM GMT
సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ కి రిలీజ్ విషయంలో బ్యాడ్‌ న్యూస్‌!
X
తమిళ సూపర్‌ స్టార్‌ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. గత కొన్నాళ్లుగా సూర్య సినిమాలను చూస్తే అయిదు ఆరు నెలల్లోనే పూర్తి చేసి ఏడాదికి రెండు మూడు సినిమాలతో సూర్య వస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సూర్య ఎక్కువ సమయం తీసుకుంటున్నాడట.

పీరియాడిక్ డ్రామా నేపథ్యం అవ్వడంతో పాటు భారీ బడ్జెట్‌ సినిమా అవ్వడం వల్ల సూర్య 42 సినిమా షూటింగ్ కు కాస్త ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. అయితే సూర్య 42 సినిమా కచ్చితంగా వచ్చే ఏడాది చివరి వరకు అయినా వస్తుందని చాలా మంది బలంగా నమ్ముతున్నారు.

ఈ సమయంలో తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కచ్చితంగా సూర్య 42 సినిమాను 2023 సంవత్సరంలో విడుదల చేయలేమని యూనిట్‌ సభ్యులు చేతులు ఎత్తేశారట. షూటింగ్‌ తో పాటు వీఎఫ్‌ఎక్స్ కి ఎక్కువ సమయం పడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారట.

2024 వరకు సూర్య మరియు శివ కాంబో సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే అంటూ యూనిట్‌ సభ్యులు తెలియజేస్తున్నారు. ఈ సినిమా ను తెలుగు నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. తమిళంలో భారీ బడ్జెట్‌ చిత్రంతో రూపొందుతున్న ఈ సినిమాను సౌత్‌ లో అన్ని భాషల్లో మరియు హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.