Begin typing your search above and press return to search.
కోట్ల బడ్జెట్ సరే వీటి సంగతేంటి ?
By: Tupaki Desk | 30 Aug 2019 8:18 AM GMTబాహుబలి ప్రభాస్ ఇమేజ్ ని వందల కోట్ల స్థాయికి తీసుకెళ్ళిన మాట నిజం. నార్త్ లో సాధారణంగా మన హీరోలకు దొరకని గుర్తింపు తనకు మాత్రమే దక్కిన మాటా నిజం. అలా అని చెప్పి ప్రభాస్ ని ఎలాంటి కథతో ఎలా తీసినా చూపించినా గుడ్డిగా హిట్టు కొట్టిస్తారు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. ఈ రోజు విడుదలైన సాహో గురించి ప్రస్తుతం ఇలాంటి చర్చే జరుగుతోంది.
మూడు వందల కోట్ల బడ్జెట్ అని నెలకో ముప్పై సార్లు పబ్లిసిటీ చేసుకోవడం బాగానే ఉంది కాని సినిమాలో దానికి న్యాయం చేకూర్చేలా అన్ని సాంకేతిక విభాగాలు తమ బెస్ట్ ఇచ్చాయా అని ప్రేక్షకులను అడిగితే ప్రశార్దకంతో కూడిన మొహమే సమాధానంగా వస్తోంది. దానికి కారణం ఉంది. సాహోలో అల్ట్రా లావిష్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ ఏవీ డెప్త్ పరంగా ఎమోషన్ పరంగా కనెక్ట్ అయ్యేలా లేకపోవడంతో క్వాలిటీ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
ముఖ్యంగా ముందు చెప్పాల్సింది సంగీతం గురించే. అరుదైన లొకేషన్లలో వీటిని షూట్ చేసుండకపోతే ఈ మాత్రం రెస్పాన్స్ అయితే దక్కేది కాదేమో. డార్లింగ్ కెరీర్ లోనే వీక్ ఆల్బంగా ఇప్పటికే దీనికి పేరు వచ్చేసింది. ఇక పదే పదే హై లైట్ చేసుకున్న విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఒకటి రెండు చోట్ల తప్పించి వావ్ అనిపించే తరహాలో ఎక్కడా లేకపోవడం కూడా ఇక్కడ గమనించాలి. మాదీ కెమెరా పనితనం ఒక్కటే కొంత మెచ్చుకోలుకు అర్హమైనది.
జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మొదట్లో మంచి ఫీల్ ఇచ్చినా ఆ తర్వాత తనూ రణగొణధ్వనులకు వెళ్ళిపోయాడు. ఫలితంగా సాహోకు అవుట్ స్టాండింగ్ లెవెల్ లో వర్క్ ఇచ్చిన డిపార్ట్ మెంట్ ఏదీ లేకపోవడం సాహోకు శాపంగా మారింది. ఇక్కడ దర్శకుడు సుజిత్ గురించి చెప్పుకుంటే ఇంకో పేజి అవుతుంది కాని అనుభవలేమి వల్ల బెస్ట్ టీం ని సరైన రీతిలో వాడుకోని మాట వాస్తవం