Begin typing your search above and press return to search.
పాపం చిన్న సినిమాలన్నీ అవుట్
By: Tupaki Desk | 9 April 2016 5:30 PM GMT''సర్దార్ గబ్బర్ సింగ్'' రిలీజ్ ను ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేశారో తెలిసిన విషయమే. అయితే ఆన్ లైన్ లో టిక్కెట్ బుక్కింగ్ సైట్లను చూస్తుంటే.. ఒక్క విషయం స్ఫుటంగా కనిపిస్తోంది. అన్ని మల్టీప్లెక్సుల్లోనూ.. కేవలం ''సర్దార్'' ''ఊపిరి'' అండ్ ''ది జంగిల్ బుక్ (తెలుగు)'' మాత్రమే ఆడుతున్నాయి.
హైదరాబాద్.. విజయవాడ.. వంటి మల్టీప్లెక్సుల్లో.. చిన్న సినిమాలైన ''కళ్యాణ్ వైభోగమే'' ''సావిత్రి'' వంటి మూవీస్ అన్నీ ఎగిరిపోయాయ్. ముఖ్యంగా మరో వారం రన్ అవ్వడానికి ఛాన్సుంటే.. ఎంతో కొంత వసూలు చేసుకునేవారు. కళ్యాణ వైభోగమే సినిమాకు మాంచి టాకే వచ్చినా కూడా.. సినిమా మాత్రం పెట్టుబడంతా వసూలు చేయలేకపోయింది. సావిత్రి పరిస్థితి ఇంకా బ్యాడ్. సినిమాకు మంచి టాక్ రావడంతో.. అసలు 6 కోట్ల రూపాయల ఇన్వెస్టుమెంటును రికవర్ చేసే ఛాన్సే లేకపోయింది. ఇప్పుడు వారం తరువాత ధియేటర్లు కూడా ఎగిరిపోవడంతో.. రికవరీ అనే మాటే సాధ్యం కావట్లేదు. ఒక పెద్ద సినిమా రిలీజవుతుంటే అదే ప్రమాదం. దాదాపు సినిమా ధియేటర్ల వారందరూ ఆ సినిమాను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. హౌస్ ఫుల్ అవుతుంది. జేబులూ నిండుతాయి. అదీ లెక్క.
ఇకపోతే ఈ సీజన్ అంతా చిన్న సినిమాలకు గడ్డు కాలమే. వరుసగా సరైనోడు - బ్రహ్మోత్సవం - అ..ఆ వంటి సినిమాలు లైనప్ లో ఉన్నాయి మరి.