Begin typing your search above and press return to search.
దీపిక మొగుడ్ని బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది!
By: Tupaki Desk | 28 Dec 2022 2:30 PM GMTబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ సక్సెస్ వేగం చూసి ఇండస్ర్టీకి మరో షారుక్ ఖాన్ వచ్చాడన్నారు. షారుక్ తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసే స్టార్ గా రణవీర్ ఖ్యాతికెక్కా డు. రెండు దశాబ్ధాల పాటు ఇండస్ర్టీని ఏలేయడం ఖాయమన్నారు. రణవీర్ లాంటి మరో నటుడు రావాలంటే? మరో పదేళలు పడుతుందన్నారు. దీపికా పదుకొణేని పెళ్లాడిన తర్వాత అతని రేంజ్ అంతకంతకు పెరిగిందన్నారు.
మరి తాజాగా రణవీర్ సింగ్ పరిస్థితి ఏంటి? అంటే హీరోగార్ని బ్యాడ్ టైమ్ బంతాడేస్తోందనే చెప్పాలి. '83' నుంచి మొదలైన పరాజయాల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. '83'..'జయేష్ భాయ్ జోర్డర్' వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫలితాలు సాధించాయి. 'సర్కస్' తో నైనా సక్సెస్ అందుకుని ఫాంలో కి వస్తాడనుకుంటే? అక్కడా తప్పటడుగు తప్పలేదు.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. రణవీర్ సైతం ఈసినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.
కానీ ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. ఆ రకంగా రణవీర్ సింగ్ కి రెండేళ్లగా విజయం అనేది అందని ద్రాక్షగానే మారిపోయింది. దీంతో అతని మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ సినిమాలన్ని వరుసగా ఫెయిల్వడంతో ఇప్పుడు కనీసం 30 కోట్లు తేవడం కూడా కానా కష్టంగా మారిందని సమాచారం. ఈనేపథ్యంలో రణవీర్ కి అడ్వాన్సులు ఇవ్వాలన్నా! నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందిట. ప్రస్తుతం రణవీర్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అదే 'రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ'. ఇదీ ఆయన సోలో హీరోగా నటిస్తోన్న చిత్రం కాదు.
ధర్మేంద్ర..జయాబచ్చన్..షభానా ఆజ్మీ...అలియా భట్ కూడా కీలక పాత్రధారులు. వాళ్లందరితో పాటు తెరను పంచుకుంటున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. మరి రణవీర్ చేతిలో ఇంకేవైనా కొత్త కమిట్ మెంట్లు ఉంటే కొత్త ఏడాది రివీల్ చేసే అవకాశం ఉంది. అంతవరకూ రణవీర్ గురించి చర్చా అనవసరమే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.