Begin typing your search above and press return to search.
టాప్ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కు బ్యాడ్ టైం
By: Tupaki Desk | 14 May 2019 1:30 AM GMTకొన్ని ప్రాజెక్ట్ లు ఎన్ని సార్లు మొదలు పెట్టినా, ఎన్ని సంవత్సరాలు ప్లాన్ చేసుకున్నా కూడా ఏదో ఒక సమస్య వల్ల ఆగి పోతూనే ఉంటుంది. ఇప్పుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'పొన్నియిన్ సెల్వన్' చిత్రం గత కొన్ని సంవత్సరాలుగా అదుగో ఇదుగో అంటూ వాయిదా పడుతూనే ఉంది. చాలా ఏళ్ల క్రితం మహేష్ బాబు, విజయ్, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్స్ తో ఈ చిత్రంను చేయాలని మణిరత్నం ప్లాన్ చేశాడు. కాని అది వర్కౌట్ కాలేదు. దాంతో ఇతర ప్రాజెక్ట్ లను మణిరత్నం చేస్తూ వచ్చాడు. తాజాగా నవాబ్ చిత్రంతో మరోసారి విజయంను దక్కించుకున్న నేపథ్యంలో లైకా ప్రొడక్షన్స్ వారిని రంగంలోకి దించి భారీ బడ్జెట్ తో 'పొన్నియిన్ సెల్వన్' చిత్రంను చేసేందుకు సిద్దం అయ్యాడు.
ఈసారి జయం రవి, కార్తి, అమితాబచ్చన్, ఐశ్వర్య రాయ్, కీర్తి సురేష్, అనుష్క వంటి స్టార్స్ ను ఎంపిక చేయడం, వారితో చర్చలు కూడా జరపడం జరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నాడు. ఈ సమయంలోనే సినిమా బడ్జెట్ తమ వల్ల కాదు అంటూ లైకా వారు దర్శకుడు మణిరత్నంకు హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ చిత్రంతో లైకా వారు చాలా లాస్ అయ్యారట. దాంతో భారీ బడ్జెట్ చిత్రాలు అంటేనే వారు కాస్త వెనుకంజ వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
శంకర్, కమల్ హాసన్ ల కాంబోలో రూపొందుతున్న 'ఇండియన్ 2' చిత్రంకు కూడా ఇదే సమస్య ఎదురైందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా మణిరత్నం సినిమాకు కూడా లైకా వారు హ్యాండ్ ఇవ్వడంతో ఆయన మరో నిర్మాతను వెదికే పనిలో పడ్డట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దర్శకుడు మణిరత్నం ఆ ప్రాజెక్ట్ ను ఏ ముహూర్తాన అనుకున్నాడో కాని అప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి సినిమాకు వస్తూనే ఉంది. అసలు అది పట్టాలెక్కి, ప్రేక్షకుల ముందుకు వచ్చేనా అనేది అనుమానంగానే ఉంది.