Begin typing your search above and press return to search.

నెల రోజులుగా కుమ్మేస్తూనే ఉంది

By:  Tupaki Desk   |   20 Nov 2018 5:35 AM GMT
నెల రోజులుగా కుమ్మేస్తూనే ఉంది
X
ఈమద్య అన్ని సినిమా పరిశ్రమల్లో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉంటుంది. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కినంత మాత్రాన ప్రేక్షకులు స్టార్స్‌ సినిమాకు బ్రహ్మర్థం పట్టడం లేదు. సినిమా బాగుంటేనే, కథ, కథనం అన్ని ఆశించినట్లుగా ఉంటేనే ఆధరిస్తున్నారు. తాజాగా భారీ బడ్జెట్‌ తో వచ్చిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. సినిమాకు నెగటివ్‌ టాక్‌ రావడంతో దారుణమైన కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి. సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చినా కూడా భారీ బడ్జెట్‌ సినిమా - స్టార్స్‌ ఉన్న సినిమా ఒకసారి చూద్దాం అని ప్రేక్షకులు అనుకునే రోజులు పోయాయి.

చిన్న చిత్రాలు మొదట డల్‌ గా సాగినా మంచి టాక్‌ వస్తే కోట్లు కురిపిస్తున్నాయి. తెలుగులో ఈమద్య పలు చిన్న చిత్రాలు మంచి వసూళ్లను సాధించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం బాలీవుడ్‌ లో ఒక చిత్రం తెగ సందడి చేస్తోంది. అతి తక్కువ బడ్జెట్‌ తో రూపొందిన ‘బడాయి హో’ అనే చిత్రం నెల రోజులగా సందడి చేస్తూనే ఉంది. హిందీ హీరో ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించిన ఈ చిత్రం ‘బడాయి హో’ ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను అందిస్తోంది.

థగ్స్‌ కు ముందు వచ్చిన ఈ చిత్రం ఇంకా కూడా మంచి షేర్‌ ను రాబడుతూనే ఉంది. థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ వచ్చిన సమయంలో ఈ చిత్రంను కొన్ని థియేటర్ల నుండి తొలగించారు. ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో ‘బడాయి హో’ జోరు కొనసాగుతోంది. 125 కోట్ల కలెక్షన్స్‌ ను రాబట్టిన ఈ చిత్రం నిర్మాతకు లాభాల వర్షం కురిపిస్తున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.

ఈ చిత్రంలో హీరో తల్లి మరియు భార్య ఒకే సారి గర్బవతి అవుతారు. దాంతో కథ చాలా వినోదాత్మకంగా సాగుతుంది. కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా ఈ ఉన్న ఈ చిత్రం బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తూనే ఉంది. మరో వారం రెండు వారాల పాటు ఈ సందడి కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.