Begin typing your search above and press return to search.
రిస్కీ సబ్జెక్టుతో తెలుగు రీమేక్
By: Tupaki Desk | 20 March 2019 7:56 AM GMTగత ఏడాది తక్కువ బడ్జెట్ లో రూపొంది సంచలన విజయం సాధించిన బాలీవుడ్ మూవీ బదాయిహో సౌత్ బాషలలో రీమేక్ చేయబోతున్నట్టు నిర్మాత బోనీ కపూర్ అధికారికంగా ప్రకటించేశారు. అయితే ఇప్పుడు దీనికి తగ్గట్టు మన దగ్గర ఆర్టిస్టులను సెట్ చేసుకోవడం అంత సులభం కాదు. కారణం కథలో ఉన్న సంక్లిష్టత. పెళ్లీడుకొచ్చిన పిల్లలున్న ఒకావిడ లేట్ ఏజ్ లో భర్త తొందరపడటం వల్ల మళ్ళి గర్భం దాలుస్తుంది.
ఇక అక్కడి నుంచి ఆ కుటుంబ సభ్యులకు కొత్త రకాల చిక్కులు సమస్యలు మొదలవుతాయి. హీరో లవ్ బ్రేకప్ అయ్యేదాకా వస్తుంది. చివరికి ఈ ఫ్యామిలీ పడిన ఇబ్బందులు వీళ్ళను ఏ తీరానికి చేర్చాయి అన్నదే కథ. చాలా విభిన్నంగా ఉండే ఈ కథ దర్శకుడు అమిత్ శర్మ ట్రీట్మెంట్ వల్ల సక్సెస్ అయ్యింది. హైదరాబాద్ లో సుమారు యాభై రోజుల దాకా ప్రదర్శింపబడటం విశేషం
ఇప్పుడీ లేట్ ఏజ్ మదర్ పాత్రను ఆర్టిస్టును సెట్ చేసుకోవడం అంత ఈజీ కాదు.కాస్త ఇమేజ్ మార్కెట్ ఉన్న సీనియర్ తారలను వెతుక్కోవాలి. ఉండటం అయితే ఉన్నారు కాని ఇలాంటి పాత్రను ఒప్పుకోవడం సులభం కాదు. నార్త్ ఆడియన్స్ తో పోలిస్తే మనవాళ్ళ టేస్ట్ వేరు. ముదిమి వయసులో శృంగారం చేసి తల్లి కావడం అనే పాయింట్ ని ఇక్కడ అనుకున్నంత ఈజీగా రిసీవ్ చేసుకోకపోవచ్చు.
తండ్రి పాత్రకు ఇంత ఇబ్బంది ఉండదు కాని ఎటొచ్చి హిందిలో చేసిన నీనా గుప్తా లాంటి వాళ్ళు తల్లి పాత్రకు దొరకాలి. ఇప్పటికే పింక్ రీమేక్ ని అజిత్ తో తీస్తున్న బోనీ కపూర్ ఈ బధాయిహోని అంత కన్నా గ్రాండ్ స్కేల్ మీద తీసే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు