Begin typing your search above and press return to search.

భ‌గీరా టీజ‌ర్: సైకో రాజాగా ప్ర‌భుదేవా చిత్ర‌విచిత్ర విన్యాసాలు!

By:  Tupaki Desk   |   20 Feb 2021 9:00 AM IST
భ‌గీరా టీజ‌ర్: సైకో రాజాగా ప్ర‌భుదేవా చిత్ర‌విచిత్ర విన్యాసాలు!
X
చాలా కాలం త‌ర్వాత ప్ర‌భుదేవా త‌న రేంజుకు త‌గ్గ చిత్రంలో న‌టిస్తున్నారా? అంటే అవున‌నే తాజాగా రిలీజైన `భ‌గీరా` టీజ‌ర్ చెబుతోంది. అభినేత్రి.. ఏబీసీడీ అంటూ ప్ర‌యోగాలు ఎన్ని చేసినా త‌న స్థాయి ఎలివేట్ కాలేదు. కానీ ఇప్పుడు త‌న‌ని ఓ విల‌క్ష‌ణ న‌టుడిగా ప్రెజెంట్ చేసుకునే అవ‌కాశం అత‌డికి లభించింద‌ని ఈ టీజ‌ర్ చెప్ప‌క‌నే చెబుతోంది.

ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఐదారు గెట‌ప్ ల‌తో ప్ర‌భుదేవా స‌ర్ ప్రైజ్ చేయ‌బోతున్నారు. ల‌వ‌ర్ బోయ్ కం సైకోగా అత‌డి న‌ట‌విన్యాసాలు పీక్స్ లో చూపించ‌బోతున్నార‌ని భ‌గీరా టీజ‌ర్ చెబుతోంది. ఈ సినిమా త‌మిళ టీజ‌ర్ ని ధ‌నుష్ ఆవిష్క‌రించగా అది అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో అమీరా దస్తూర్ క‌థానాయిక‌.

ఇక టీజ‌ర్ లో ప్రభుదేవా ర‌క‌ర‌కాల వేషాల‌తో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్నారు. తొలిసారిగా అత‌డు బట్టతల తల గెట‌ప్ తోనూ క‌నిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్ర‌భుదేవా సైకో కిల్లర్‌గా కనిపిస్తాడు. కిల్లర్ అవతారం కోసం అనేక రూపాల్లోకి మారుతుండాట‌ని టీజ‌ర్ లో చూపించారు. అమైరా దస్తూర్ - రమ్య నంబీసన్- జనని అయ్యర్- సాంచిత శెట్టి- గాయత్రి శంకర్- సాక్షి అగర్వాల్ లాంటి భామ‌లు న‌టించారు. 7/ జి బృందావ‌న కాల‌నీ ఫేం సోనియా అగర్వాల్ కీలక పాత్రలో న‌టిస్తోంది.

అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇది ఆయ‌న కెరీర్ మూడవ సినిమా. మూడేళ్ళ గ్యాప్ త‌ర్వాత భ‌గీరాతో స‌త్తా చాటాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భరతన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. గణేశన్ శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు.