Begin typing your search above and press return to search.

65 రోజుల్లో 'బాహుబలి 2' మూడు రాష్ట్రాల రికార్డులు గల్లంతు

By:  Tupaki Desk   |   20 Jun 2022 2:30 AM GMT
65 రోజుల్లో బాహుబలి 2 మూడు రాష్ట్రాల రికార్డులు గల్లంతు
X
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే. అయిదు సంవత్సరాల క్రితం వచ్చిన బాహుబలి 2 ఎన్నో రికార్డులను నమోదు చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో నెం.2 గా నిలిచింది. దంగల్ తర్వాత స్థానంలో 1800 కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన బాహుబలి 2 ఇప్పటికి కూడా ఇండియాస్ నెం.2 బిగ్గెస్ట్‌ మూవీగా ఉంది.

ఆ రికార్డు పదిలంగా ఉన్నా మూడు రికార్డులు మాత్రం కేవలం 65 రోజుల వ్యవధిలో గల్లంతు అయ్యాయి. అయిదు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో.. తమిళనాడు మరియు కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి 2 రికార్డు సాధించింది. అయిదు సంవత్సరాల తర్వాత ఈ మూడు రాష్ట్రాల వసూళ్లకు సంబంధించిన రికార్డులు బ్రేక్‌ అయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్ల రికార్డును దక్కించుకున్న బాహుబలి 2 ను అదే రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ బ్రేక్ చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆర్‌ ఆర్ ఆర్‌ ఉండగా నెం.2 స్థానంలో బాహుబలి 2 నిలిచింది. ఇక అయిదు సంవత్సరాలుగా కర్ణాటకలో బాహుబలి 2 అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా ఉంది. ఆ రికార్డును ఇటీవల వచ్చిన కేజీఎఫ్ 2 బ్రేక్ చేసింది.

కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా కేజీఎఫ్ 2 నెం.1 స్థానంలో నిలిచింది. అలాగే తమిళనాట కూడా బాహుబలి 2 రికార్డును చాలా ఈజీగా యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నటించిన విక్రమ్‌ సినిమా బ్రేక్‌ చేసింది. అయిదు సంవత్సరాలుగా తమిళనాట ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి కాని బాహుబలి 2 వసూళ్ల రికార్డును బ్రేక్‌ చేయలేదు. ఎట్టకేలకు విక్రమ్‌ సినిమా ఆ రికార్డును బ్రేక్ చేసింది.

మొత్తానికి బాహుబలి 2 రికార్డులు ఈ మూడు రాష్ట్రాల్లో బ్రేక్ అవ్వడంకు అయిదు సంవత్సరాలు పట్టింది. ఇక ఓవరాల్‌ గా సాధించిన 1800 కోట్ల రూపాయల వసూళ్ల బాహుబలి 2 రికార్డు మాత్రం అలాగే ఉంది. ఆ రికార్డు బ్రేక్‌ చేయబోతున్న సౌత్‌ సినిమా ఏదో చూడాలి.

కేవలం 65 రోజుల వ్యవధిలో వచ్చిన మూడు సినిమాలు( ఆర్ ఆర్‌ ఆర్‌... కేజీఎఫ్ 2... విక్రమ్‌ ) లు అయిదు సంవత్సరాల బాహుబలి 2 రికార్డులు బ్యాక్ టు బ్యాక్ గల్లంతు చేయడం ఒక అద్బుతం అన్నట్లుగా బాక్సాఫీస్‌ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.