Begin typing your search above and press return to search.
'మహేష్ - రాజమౌళి' మూవీ బ్యాక్ డ్రాప్ పై 'బాహుబలి' రచయిత..!
By: Tupaki Desk | 6 July 2021 7:30 AM GMTదర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత సినిమా మహేష్ తోనే ఉంటుందని జక్కన్న ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్.. మహేష్ కోసం ఓ జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ స్టోరీ రెడీ చేస్తున్నారని.. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే నిర్మాత కేఎల్ నారాయణ మాత్రం అవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు. దీంతో రాజమౌళి - మహేష్ కాంబోలో ఎలాంటి సినిమా రాబోతోంది?ఏ జోనర్ లో ఉంటుంది? ఏ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా 'బాహుబలి' రచయిత ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ లో ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ చేయాలనే ఆలోచన ఉన్నట్లు విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ''మహేష్ బాబు సినిమా పనులు జరుగుతున్నాయి. కొన్ని ఐడియాలు అనుకుంటున్నాం. ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అదెలా చేయగలమని ఆలోచిస్తున్నాం. దాని మీద కొంత రీసెర్చ్ చేయాల్సి ఉంది'' అని విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ మీడియాతో చెప్పారు. అలానే 'ఈగ' చిత్రానికి సీక్వెల్ చేసే ఐడియా కూడా ఉందని.. కాకపోతే ఇప్పుడప్పుడే చేసే అవకాశం లేదని స్టార్ రైటర్ తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో మహేష్ తో జక్కన్న ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ మూవీ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అర్థం అవుతోంది. ఒకవేళ ఆ జోనర్ టచ్ చేయకపోతే ఇంతకముందు చెప్పినట్లు జేమ్స్ బాండ్ తరహా కథతో సినిమా చేసే అవకాశం ఉంది.
మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తన 28వ చిత్రాన్ని చేస్తారు మహేష్. ఈ రెండు పూర్తైన తర్వాత రాజమౌళి కాంబోలో సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రెడీ చేసి పనిలో ఉన్న రాజమౌళి.. ఈ సినిమా విడుదలైన తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకుని మహేష్ మూవీ పనుల్లో బిజీ అవుతారని తెలుస్తోంది. పదేళ్ల క్రితమే అనుకున్న ఈ క్రేజీ కాంబో.. ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్నాళ్ళు తెలుగు సినిమాలతో ఇతర ఇండస్ట్రీలలో క్రేజ్ తెచ్చుకున్న మహేష్.. జక్కన్న సినిమాతో నేషనల్ వైడ్ సత్తా చాటనున్నాడని చెప్పవచ్చు.