Begin typing your search above and press return to search.
'బాహుబలి' ఒక చరిత్ర .. ఇక ఇప్పుడు 'పీఎస్ 1' టైమ్!
By: Tupaki Desk | 24 Sep 2022 4:08 AM GMTమణిరత్నం ఎంచుకునే కథలు .. పాత్రలను ఆయన మలిచే విధానం వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. అలాంటి మణిరత్నం నుంచి ఈ సారి భారీ చారిత్రక చిత్రం రానుంది .. ఆ సినిమా పేరే 'పొన్నియిన్ సెల్వన్'. చోళ రాజుల పాలనా కాలంలో జరిగిన కొన్ని సంఘటనల సమాహారమే ఈ సినిమా.
అలాంటి ఈ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఈ సినిమాలో చేసిన హీరోలు .. హీరోయిన్స్ అంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ స్టేజ్ పై కార్తి మాట్లాడుతూ .. "సినిమా ఎంత గొప్ప మీడియం అనేది ఇలాంటి పెద్ద సినిమాలు చేసినప్పుడే గుర్తుకు వస్తుంటుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది మణిరత్నంగారి 40 ఏళ్ల కల. అందరూ కూడా ఈ సినిమా 'బాహుబలి'లా ఉంటుందా? అని అడుగుతున్నారు. 'బాహుబలి' సినిమాను మనం చూశాము .. మనకి నచ్చింది. ఇంకో 'బాహుబలి' మనకి అవసరమే లేదు. ఈ భూమ్మీద ఎన్నో కథలు ఉన్నాయి .. ఎంతోమంది హీరోలు ఉన్నారు. అలాంటి ఒక ఆసక్తికరమైన కథ ఇది.
70 ఏళ్లుగా బెస్ట్ సెల్లార్ గా ఉన్న ఒక నవలను మణిరత్నం సార్ ఈ సినిమాగా తీయడం జరిగింది. ఈ సినిమా కోసం ఇంతమంది స్టార్స్ తో కలిసి పనిచేయడం గొప్ప అవకాశంగా .. అదృష్టంగా నేను భావిస్తున్నాను.
ఈ సినిమాలో రొమాన్స్ .. అడ్వెంచర్ .. ఆనాటి రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. రామాయణ .. మహాభారతాల్లో మాదిరిగా విభిన్నమైన పాత్రలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇక నేను ఏ ఆర్ రెహ్మాన్ గారి అభిమానిని. 'నువ్వు కళను ఫాలో అయితే ప్రపంచం నిన్ను ఫాలో అవుతుంది' అని ఆయన చెప్పిన మాటనే నేను ఫాలో అవుతున్నాను.
ఈ సినిమా ఈ నెల 30వ తేదీన విడుదలవుతోంది. లైకా ప్రొడక్షన్స్ వారికీ .. దిల్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాకి సంబంధించి తెలుగు డైలాగ్స్ చెప్పడానికి నేను చాలా కష్టపడ్డాను. ఎన్టీఆర్ ను గుర్తుచేసుకుని ఆ డైలాగ్స్ ను చెప్పాను. ఆయన ఎన్నో చారిత్రక చిత్రాలు చేశారు గనుక, భయపడుతూనే ఈ సినిమాను చేశాను. ఈ సినిమాను మీరంతా ఆదరిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.