Begin typing your search above and press return to search.
వెటరన్ లిరిసిస్ట్ తో వివాదం.. ఎట్టకేలకు కంగనకు బెయిల్!
By: Tupaki Desk | 27 March 2021 6:33 AM GMTవివాదాల కంగన మబ్బుల్లో తేలి సంబరాలు చేసుకునే అరుదైన సందర్భమిది. 2019 సంవత్సరానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న తర్వాత బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్ కు మరో శుభవార్త అందింది. క్వీన్ నిరభ్యంతరంగా వేడుకలు జరుపునేంత శుభదినమిది.
తాజా సమాచారం మేరకు.. క్వీన్ కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రముఖ బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్ కంగనపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో అంధేరిలోని ముంబై మెట్రోపాలిటన్ కోర్టు కంగనాకు బెయిల్ మంజూరు చేసింది.
2020 నవంబర్ లో అర్నాబ్ గోస్వామితో రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన ఇంటర్వ్యూలో కంగనా తనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు జావేద్ అక్తర్ కోర్టును ఆశ్రయించారు. కంగనాను విచారణకు పిలిచినా ఆమె కోర్టు ముందు హాజరుకాకపోవడంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
బాలీవుడ్ మాఫియాలో జావెద్ కూడా ఒక భాగమని కంగన ఇంతకుముందు వ్యాఖ్యానించారు. అయితే తాను మాత్రం దేనినైనా తప్పించుకోగలనని కంగనా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. హృతిక్ తో కంగన ఎఫైర్ వ్యవహారంలో జరిగిన రచ్చ సందర్భంగా లిరిసిస్ట్ జావేద్ కంగనను హెచ్చరించడం ఆపై అతడిపై క్వీన్ గరంగరం తెలిసినదే. ఈ వివాదం చినికి చినికి గాలివానై చివరికి కోర్టుల వరకూ వెళ్లింది. ప్రస్తుతం విచారణ సాగుతోంది.