Begin typing your search above and press return to search.
అజ్ఞాతవాసి వల్ల డిమాండ్ పెరిగిందా?
By: Tupaki Desk | 21 Dec 2017 11:30 AM GMTహీరోయిన్స్ జాతకం మారాలంటే ఒక్క సినిమా కరెక్ట్ గా పడితే చాలు నెక్స్ట్ డే నుంచి బిజీ షెడ్యూల్ తో గడపాల్సిందే. స్టార్ హీరోయిన్స్ ఈ మధ్య గ్యాప్ ఇవ్వడంతో కొంత మంది మలయాళీ ముద్దుగుమ్మలు స్టార్ హీరోల సినిమా ఛాన్సులను కొట్టేస్తున్నారు. అంతే కాకుండా గ్లామర్ షోలతో రెచ్చిపోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం చాలా మంది హీరోల కన్ను ఒక హీరోయిన్ పై పడినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించిన అను ఇమ్మాన్యుయేల్.
అమ్మడి పాత్రకు సినిమాలో ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలియదు గాని పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఆడియెన్స్ లో మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. అంతే కాకూండా ఇటీవల బైటికొచ్చి చూస్తే మేకింగ్ సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే అందులో అను చాలా హాట్ గా కనిపించింది. షాట్ గ్లామర్ డ్రెస్సులో స్కిన్ షోని బాగానే చేసింది. దీంతో అను పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మారు మ్రోగిపోయింది.
అయితే అందరు ఈ బ్యూటీ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే చూస్తున్నారు. ముఖ్యంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ గోపీచంద్ మలినేని తో చేయబోయే సినిమాలో అనుని సలెక్ట్ చేయమని ఆ చిత్ర నిర్మాతలను కోరుతున్నట్లు తెలుస్తోంది. జె భగవాన్ - జె పుల్లారావ్ ఆ సినిమాకు నిర్మాతలు. అందుకు అను మాత్రం రూ.75 లక్షల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తోందట. అయితే నిర్మాతలు బేరమాడడంతో ఫైనల్ గా 50కి తెగ్గొట్టిందని టాక్.
ఇక ఈ సినిమాలో నటిస్తే అమ్మడు నాలుగో మెగా హీరోతో సినిమా చేసినట్లు అవుతుంది. ప్రస్తుతం బన్నీ - నా పేరు సూర్యలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ బోయపాటి సినిమాలో కూడా అను ఇమ్మాన్యుయేల్ ను సెలెక్ట్ చేసే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.