Begin typing your search above and press return to search.
బాజీరావ్.. బాహుబలి రేంజ్ కష్టమే
By: Tupaki Desk | 3 Jan 2016 7:00 AM GMTఈ క్రిస్ మస్ కానుకగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించి భాజీరావ్ మస్తానీ - షారూక్-కాజోల్ జంటగా నటించిన దిల్ వాలే రిలీజయ్యాయి. ఇవి రెండూ బాక్సాఫీస్ వద్ద ఒకదానితో ఒకటి ఢీకొట్టాయి. ఆరంభం దిల్ వాలే జోరు కొనసాగినా, వారం రోజుల్లోనే ఆ సినిమా చతికిలబడిపోయిందని రిపోర్ట్ వచ్చింది. స్టోలీ అండ్ స్టీడీ ఇన్ ద విన్స్ ఆన్ ద రేస్.. అన్న చందంగా భాజీరావ్ మస్తానీ ఆరంభం నెమ్మదిగా వసూళ్లు సాగించినా లాంగ్ రన్ లో స్థిరంగానే వసూళ్లను సాధిస్తోందన్న రిపోర్ట్ వచ్చింది.
ఈ సినిమా దేశంలోనే ఛాలెంజింగ్ మూవీగా పాపులర్ అయ్యింది. బాహుబలి తర్వాత మళ్లీ ఆ రికార్డుల్ని కొట్టే సినిమాగా పాపులర్ అయ్యింది. మూవీలో బాహుబలి వాసనలు లేవు. అలాంటి మెస్మరైజింగ్ వార్ ఎపిసోడ్స్ లేవు. మాస్ మసాలా కంటెంట్ అసలే లేదు. భారీ యుద్ధ సన్నివేశాలకు ఛాన్సే లేదు. కేవలం పెష్వాల వంశం - అందులో అందమైన లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ఆరంభం బాహుబలి రేంజులో దూకుడు సాగించలేకపోయినా.. నెమ్మదిగా రెండో వారానికి బాహుబలి రికార్డుల్ని టచ్ చేసే రేంజుకి వచ్చింది. రెండు వారాల్లోనే ఈ మూవీ దేశీయంగా దాదాపు 150 కోట్ల 'నెట్' వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచింది. ఓవర్సీస్ లోనూ చెప్పుకోదగ్గ విజయం సాధించింది.
ఇప్పటికీ వసూళ్ల పరంగా స్మూత్‌గానే ముందుకు సాగుతోంది. మునుముందు మరిన్ని రికార్డుల్ని టచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కాకపోతే మరీ బాహుబలి రేంజ్ లో 600 కోట్ల గ్రాస్ సాధించడం అంటే కష్టమే.