Begin typing your search above and press return to search.
రిలీజ్ కోసం బాజీరావ్ యుద్దాలే!!
By: Tupaki Desk | 21 Nov 2015 4:05 PM GMTసంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకొనే - ప్రియాంక చోప్రాలు నటించిన బాజీరావ్ మస్తానీ టీజర్ కి - ట్రైలర్ కి బ్రహ్మాండమైన అప్లాజ్ వచ్చింది. పిక్చరైజ్ చేసిన విధానానికి చాలామంది ఫ్లాట్ అయిపోయారు కూడా. అయితే చరిత్రను వక్రీకరించారంటూ విమర్శలు కూడా బాగానే చుట్టుముట్టాయి.
ఇప్పుడు బాజీరావ్ మస్తానీ వారసుడు ప్రసాదరావ్ పేష్వా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. త్వరలో రిలీజ్ కానున్న ఈ మూవీలో తమ చరిత్రను - మహరాష్ట్ర చరిత్రను అవమానించే సన్నివేశాలున్నాయని ఆరోపించారు. ఈ మేరకు మహా సీఎం ఫడ్నవీస్ కి ప్రసాదరావ్ ఓ లేఖ కూడా రాశారు. ప్రభుత్వం ఈ సినిమా విషయంలో కలుగ చేసుకుని, చరిత్రను అవమానించకుండా చూడాలన్నది ఈయన అభ్యర్ధన. అయితే చరిత్రను సినిమాగా తీసేవాళ్లు కొంత స్వేచ్ఛ తీసుకుంటారని, దీనికి తాను అంగీకరిస్తానన్న ఆయన.. బాజీరావ్ మస్తానీ లో మరీ మితిమీరిపోయిందని అంటున్నారు.
పింగా పాటను ప్రత్యేకంగా ప్రస్తావించిన ఈయన.. మహరాష్ట్ర సంప్రదాయ నృత్యాన్ని మరీ ఐటెం సాంగ్ గా మార్చేశారని అంటున్నారు. అంతేకాదు.. అసలు రాజ కుటుంబంలోని మహిళలు పబ్లిక్ ప్లేసుల్లో డ్యాన్సులు చేసిన ఆనవాళ్లు చరిత్రలో లేవని కూడా వివరించారు ప్రసాదరావు. మరి ఈ ప్రశ్నలు - వివాదాలపై డైరెక్టర్ కానీ, యూనిట్ కానీ స్పందించలేదు. త్వరగా వీటిని పరిష్కరించుకోకపోతే మాత్రం.. రిలీజ్ కి ఇబ్బందులు పడాల్సి వస్తుందని బాలీవుడ్ జనాలు అంటున్నారు.