Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ చిరు సినిమానే భజరంగీ

By:  Tupaki Desk   |   21 July 2015 1:49 PM GMT
మెగాస్టార్‌ చిరు సినిమానే భజరంగీ
X
బాహుబలిని జాతీయ సినిమాగా గుర్తించాలి. భాష, ప్రాంతంతో పని లేకుండా అందరి మన్ననలు అందుకున్న సినిమా గా ఆ అర్హత ఈ చిత్రానికి ఉందని అంటున్నారు రచయిత విజయేంద్ర ప్రసాద్‌. ఆయన మరిన్ని ఆసక్తికర సంగతుల్ని ముచ్చటించారిలా..

= రిలీజైన 10రోజుల్లో రూ.350కోట్లు వసూలు చేసిన చిత్రమిది. ఇది ఇండియన్‌ సినిమా ఎఛీవ్‌మెంట్‌ గా భావించాలి. కేవలం ఒక భాషకి, ఒక ప్రాంతానికి చెందిన సినిమా అని తీసిపారేయొద్దని విజ్ఞప్తి చేశారు. తెలుగు, తమిళ్‌ రెండు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినా మలయాళం, కన్నడం, హిందీ అన్నిచోట్లా ఘనవిజయం సాధించిందన్నారు. నిజానికి ఈ సినిమా తీసే ముందు హిట్టవుతుందా లేదా అన్నది రాజమౌళికే తెలీదు. ఓ ప్రయత్నం చేశాడు. అందరినీ మెప్పించి ఇంతటి విజయం సాధించింది.

= నేను రచయితగా పనిచేసిన బాహుబలి, భజరంగి భాయిజాన్‌ రెండూ విమర్శకుల మెప్పు పొందాయి. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రెండు సినిమాలకు వేరే రచయిత పనిచేసినా నేను సంతోషించేవాడిని. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలన్నదే నా ఆకాంక్ష.

= భజరంగి భాయిజాన్‌ చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'పసివాడి ప్రాణం' ఇన్‌స్పిరేషన్‌. ఆ చిత్రం నన్ను ఎంతో వెంటాడింది. దానికి కాంటెంపరరీ టచ్‌ ఇచ్చి ఈ కథ రాసుకున్నా. అలాగే పాకిస్తాన్‌ లో చికిత్స లభించక ఇండియా వచ్చి ఓ చిన్నారి హృదయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అది నన్ను ఎంతో వెంటాడింది. ఈ రెండిటి నుంచి భజరంగి కథ పుట్టింది. పాకిస్తాన్‌ బార్డర్‌ ని ఉపయోగించాను కాబట్టి .. కథకి ఎక్కువ ఎమోషన్‌ గ్రాఫ్‌ పెరిగిందని ప్రసాద్‌ చెప్పారు.