Begin typing your search above and press return to search.
సల్మాన్‌ఖాన్ ఏడిపించేశాడంటున్నారే..
By: Tupaki Desk | 15 July 2015 12:22 PM GMTసల్మాన్ ఖాన్ సినిమా అంటే మాస్ ఆడియన్స్‌కు విందు భోజనమే. అతడి సినిమాల్లో పెద్దగా సెంటిమెంట్లు అవీ ఉండవు. రొమాన్స్ కూడా తక్కువే. లాజిక్కులతో సంబంధం లేని యాక్షన్, ఎంటర్టైన్మెంటుకు అతడి సినిమాలు ప్రసిద్ధి. సల్మాన్ సినిమాలు రిలీజైనపుడు క్రిటిక్స్ చెలరేగిపోతుంటారు. రాజీవ్ మసంద్ లాంటి వాళ్లయితే సల్మాన్ సినిమాలకు దారుణమైన రేటింగులిస్తారు. ఐతే ఆ రేటింగులకు విరుద్ధంగా సల్మాన్ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. గత ఏడాది రిలీజైన కిక్ సినిమా పరిస్థితి కూడా అంతే. ఐతే ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేస్తే జనాలకు కూడా మొహం మొత్తేయడం ఖాయం.
అమీర్ ఖాన్ లాంటి వాళ్లు అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలతో తిరుగులేని విజయాలు సాధిస్తుంటే తానింకా మాస్ ఆడియన్స్ పేరు చెప్పి రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలే చేయడం బాగోదనుకున్నాడో ఏమో.. ఈసారి రూటు మార్చినట్లున్నాడు. సల్మాన్ కొత్త సినిమా ‘భజరంగి భాయిజాన్’ గుండె తలుపుల్ని తట్టే సినిమా అని చెబుతున్నారు. నిన్న ముంబయిలో ప్రిమియర్ షో చూసి సెలబ్రెటీలందరిదీ ఇదే మాట. ఈసారి సల్మాన్ గుండెల్ని పిండేయబోతున్నాడట. ఇందులో కంటెంట్ చాలా గొప్పగా ఉందని.. సల్మాన్ కన్నీళ్లు పెట్టించేశాడని.. సల్మాన్ కెరీర్లో ఇదో విభిన్నమైన సినిమా అవుతుందని ట్వీట్ చేశాడు కరణ్ జోహార్. అతనిలా అన్నాడంటే భజరంగి భాయిజాన్‌లో ఏదో విశేషం ఉన్నట్లే.