Begin typing your search above and press return to search.
బాలయ్య తో 108 అనీల్ మార్క్ హాస్యమా?
By: Tupaki Desk | 13 Jun 2022 11:30 PM GMTయంగ్ మేకర్ అనీల్ రావిపూడి పేరిప్పుడు టాలీవుడ్ లో మార్మోగుతోంది. అపజయమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. టీవలే 'ఎఫ్-3' తో మరో భారీ సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు. 'పటాస్'..'సుప్రీమ్'.. 'ఎఫ్-2'..'రాజా ది గ్రేట్'..'సరిలేరు నీకెవ్వరు' తో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు ఖాతాలో వేసుకున్నాడు.
అన్నివాణిజ్య అంశాల్ని దృష్టిలో పెట్టుకుని చేసిన చిత్రాలే. వీటిలో ఏవి నేల విడిచి సాము చేసినవి కావు. హీరోల ఎనర్జీని..గ్రేస్ ని దృష్టిలో పెట్టుకుని అల్లుకున్న కథలే. అయితే వాటిని తనదైన శైలి హాస్యాన్ని అద్ది ఎగ్జిక్యూట్ చేయడంలో నూరు శాతం సక్సెస్ అయ్యాడు. వీటన్నింటిలో కామన్ పాయింట్ హాస్యానికి పెద్ద పీట వేయడమే.
అక్కడే అనీల్ సగం సక్సెస్ లోకి పోతున్నాడు. ఆ థీమ్ ని పట్టుకునే మరోసారి 'ఎఫ్-3' తో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయగలిగాడు. ఈ సినిమా సక్సెస్ తో జంధ్యాల లాంటి సుప్రసిద్ద దర్శకుడితోనే పోలిక అందుకున్నాడంటే అనీల్ ఘనాపాటి అని చెప్పక తప్పదు. మరి అంతటి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడిగా బాలయ్య లాంటి కామెడీ టింజ్ ఉన్న హీరో దొరికితే హాస్యాన్ని ఇంకే స్థాయిలో పండిస్తాడో చెప్పాల్సిన పనిలేదు.
మిగతా కథ ఎలా ఉన్నా అనీల్ మళ్లీ తన సక్సెస్ మార్క్ ని మాత్రం మిస్ చేయడని అంచనాలున్నాయి. బాలయ్య తో నెక్స్ట్ లెవల్ కామెడీ పండిస్తాడని ఊహాగానాలొస్తున్నాయి. బాలయ్య 108వ చిత్రానికి అనీల్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య 107వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయిన వెంటనే అనీల్ సినిమా సెట్స్ కితీసుకెళ్లనున్నారు.
ప్రస్తుతం అనీల్ బాలయ్య స్ర్కిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నారు. అక్కడ నుంచి వస్తోన్న లీకులు చూస్తుంటే? బాలయ్య ఇమేజ్ కి ఏమాత్రం తగ్గని కథలో చూపించబోతున్నాడని తెలుస్తోంది. దీనిలో భాగంగా బాలయ్య తో హాస్యాన్ని పండించడానికి..ఆ సన్నివేశాల్ని హైలైట్ చేయడానికి బాలయ్యలో కామెడీ యాంగిల్ ని స్టడీ చేస్తున్నాడుట.
బాలయ్య పాత చిత్రాల కామెడీ సన్నివేశాల్ని రిఫరెన్స్ గా తీసుకుంటున్నాడుట. బాలయ్య గత చిత్రాలైన సక్సెస్..ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా థియేటర్లో బాగా పండిన హాస్య సన్నివేశాల టైమింగ్ పల్స్ ని పట్టుకుని సీన్స్ రాస్తున్నట్లు సోర్సెస్ ద్వారా తెలిసింది. ఓ వైపు బాలయ్య లో సీరియస్ నెస్ ని హైలైట్ చేస్తూనే మరోవైపు కామెడీకి అంతే పెద్ద పీట వేసే సన్నివేశాలు డిజైన్ చేస్తున్నట్లు గుస గుస వినిపిస్తుంది.
సినిమాలో ఎంత మంది ఆర్టిస్టులున్నా బ్యాలెన్స్ చేయగల దర్శకుడు అనీల్. వీలైతే అందరితోనూ ఒకే సారి కామెడీ పండించగల సమర్ధుడు. సహజంగానే బాలయ్య సినిమా అంటే ఆర్టిస్టులు..విలన్లు కూడా ఎక్కువగానే ఉంటారు. బాలయ్య 108 లో వాళ్లని కూడా విడిచిపెట్టడు. అందరితో గంపాగుత్తుగా హాస్యాన్ని పండించేయడు.